ఈ సింపుల్ టిప్స్ తో గూగుల్ లోని నకిలీ ఫోటోలను ఈజీ గా గుర్తించవచ్చు..!

ప్రస్తుత రోజులలో స్మార్ట్ ఫోన్ వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో ఎక్కువ మంది ఏదైనా తెలుసుకోవాలి అంటే ముందుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ ను  సంప్రదిస్తుంటారు.

 Follow These Simple Tips To Find Fake Images On Google , Google Image, Search, F-TeluguStop.com

ఈ క్రమంలో మనం ఇంటర్నెట్ లో చాలా రకాలైన ఫోటోలను చూస్తూ ఉంటాము.ఇక ఆ ఫోటో నిజమా కాదా అన్నది మాత్రం మనకు తెలియదు.

ఎందుకంటే అలాంటి ఫోటోలను గ్రాఫిక్స్ తో మార్చేసి వేరే విధంగా చూపిస్తూ ఉంటారు కొందరు.ఇలాంటివి ఎక్కువగా రాజకీయ నేతలకు, సెలబ్రిటీల విషయంలో మనం చూస్తూనే ఉంటాం.

అయితే మనం చూసే ఫోటో నిజమేనా కాదా అన్నది తెలుసుకోవాలంటే గూగుల్ లో సింపుల్ టిప్స్ తెలిస్తే చాలు.

ఇందుకొరకు మనం గూగుల్‌ ఇమేజెస్‌ మనకు రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ అనే ఆప్షన్ ను యూజర్స్ కోసం అందజేస్తోంది.

మనం ఏదైనా గూగుల్ ఇమేజెస్ లో ఒక ఫోటో కోసం వెతుకుతున్న సమయంలో ఆ ఫోటో విషయంలో మనకు ఏదైనా అనుమానం, సందేహాలు ఉంటే వెంటనే గూగుల్ ఇమేజెస్ కి వెళ్లి కెమెరా ఐకాన్ పై క్లిక్ చేసి మీకు డౌట్ ఉన్న ఫోటో యూఆర్‌ఎల్‌ లేదా ఆ ఫోటో నేరుగా అప్లోడ్ చేయాలి.అప్పుడు మనకు వెంటనే ఆ ఫోటో గురించి పూర్తి వివరాలు, దాని మూలం ఎక్కడ అనేది పూర్తిగా తెలిసిపోతుంది.

Telugu Duplicate, Google, Google Search, Reverse Search, Search, Search Google-L

అదే మీ ఆండ్రాయిడ్ పరికరంలో కూడా ఇమేజ్ నిజమా కాదా.అన్నది తెలుసుకోవాలంటే గూగుల్ రివర్స్ సెర్చ్ చేయడానికి మీకు అనుమానం ఉన్న  ఫోటోను ముందుగా ఎంపిక చేసి దాని మీద రైట్ క్లిక్ ఇస్తే అక్కడ మనకు సెర్చ్‌ గూగుల్‌ ఫర్‌ ఇమేజ్‌ అనే ఆప్షన్ ఉంటుంది.అది క్లిక్ చేస్తే చాలు మనకు వెంటనే ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం, పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.ఇంకెందుకు ఆలస్యం మీకు ఏవైనా ఫోటోల మీద అనుమానం ఉంటే ఇలా చేసుకొని తెలుసుకోండి అవి నిజమా కదా అని.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube