శ్రీహరి కట్టిన తాళి మాత్రమే మిగిలి ఉంది... ఎమోషనల్ అయిన డిస్కో శాంతి!

ప్రముఖ దివంగత నటుడు శ్రీహరి( Srihari ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ రియల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నటువంటి శ్రీహరి 2013 వ సంవత్సరంలో ఓ సినిమా షూటింగ్లో తీవ్ర అస్వస్థతకు గురై మరణించిన సంగతి మనకు తెలిసిందే.

 Sriharidied Wrong Treatment Reveal Disco Shanti, Srihari ,disco Shanthi, Wrong T-TeluguStop.com

అయితే శ్రీహరి మరణించిన తర్వాత ఆయన భార్య పిల్లలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.తాజాగా శ్రీహరి భార్య డిస్కో శాంతి ( Disco Shanthi ) ఇంటర్వ్యూలో పాల్గొని తన ఇబ్బందుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

శ్రీహరి గారు మరణించిన తర్వాత తన కుటుంబం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందని అయితే ఇండస్ట్రీ నుంచి తనకు ఎలాంటి సహాయం అందలేదని ఈమె తెలియజేశారు.శ్రీహరి చనిపోయిన తర్వాత ఆయన డబ్బులు ఎవరికి ఇచ్చారు ఏంటి అనే విషయాలు మాకు తెలియదు కానీ శ్రీహరి మాకు డబ్బు ఇవ్వాలి అంటూ చాలామంది మా ఇంటికి వచ్చారని తెలిపారు.ఇలా చాలామంది అప్పుల పేరుతో ఇంటికి వచ్చి తమపై ఒత్తిడి చేశారని డిస్కో శాంతి వెల్లడించారు.

ఈ విధంగా అప్పు ఒత్తిడి అధికమవడంతో చేసేదేమీ లేక ఉన్న భూములు, ఆస్తులను, బంగారం( Gold ) మొత్తం అమ్మేశామని తెలియజేశారు.ప్రస్తుతం తన వద్ద శ్రీహరి నా మెడలో కట్టిన తాళి తప్ప ఏమీ లేదని ఈమె ఎమోషనల్ అయ్యారు.తాము ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఒక కారును కూడా ఈఎంఐ కట్టలేదని బ్యాంకు వాళ్లు తీసుకున్నారని తెలిపారు.

అయితే ప్రస్తుతం తనకు రెండు ఇల్లు ఉన్నాయని ఆ రెండు ఇల్లు ద్వారా వచ్చే అద్దెతోనే జీవనం గడుపుతున్నామని డిస్కో శాంతి తెలియజేశారు.అయితే తనకు సినిమాలలో ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube