కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే.గత కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్న వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు తన ముఖ్య అనుచరులతో సమావేశం అయ్యారు.
సమావేశంలో భాగంగా యార్లగడ్డ కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ శ్రేణులకు క్షమాపణ చెబుతున్నట్లు చెప్పారు.
మన ఓటమే మన సమస్యలకు కారణమని పేర్కొన్నారు.పదవి లేకపోతే వెనుక పది మంది కూడా ఉండరని తెలిపారు.
తాను ఎదుర్కొన్న అవమానాలు ఎవరూ ఎదుర్కోలేదన్నారు.మనం చెబితే ఒక పని కూడా జరగదన్న యార్లగడ్డ అక్రమ కేసులు పెట్టారని మొత్తుకున్నా మన మాట వినరని వెల్లడించారు.
అయితే వైసీపీ అధిష్టానం గన్నవరం నియోజకవర్గ అభ్యర్థిగా యార్లగడ్డను కాదని వల్లభనేని వంశీని ప్రకటించిన సంగతి తెలిసిందే.మరోవైపు ఆయన నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరతారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది.