Sreeleela Ntr : ఎన్టీఆర్, శ్రీలీల కలిసి నటిస్తే టాప్ లేచిపోద్ది.. ఒక్క సినిమా తెరకెక్కినా చాలంటూ?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే, యంగ్ హీరోయిన్ శ్రీ లీల.( Sreeleela ) వీరిద్దరి పేర్లు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.కాగా వీరిద్దరి అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.అందుకు కారణం కూడా లేకపోలేదు.తాజాగా శుక్రవారం రాత్రి దుబాయ్‌లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 వేడుక అట్టహాసంగా జరిగింది.ఈసారి ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ).ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 Ntr And Sreeleela Names Are Trending In Social Media After Siima-TeluguStop.com
Telugu Dhamaka, Mahesh Babu, Pawan Kalyan, Ravi Teja, Siima, Sreeleela, Tollywoo

తాను కష్టాల్లో ఉన్నపుడు, కింద పడినప్పుడు తనని పట్టుకొని లేపినందుకు అందరికీ నా పాదాభివందనాలు చేస్తున్నాను అని తెలిపారు.దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.#ManofMasses #NTR #Devara టాగ్స్‌ని ట్రెండ్ చేస్తూ నందమూరి ఫ్యాన్స్, డై హార్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

ఇక బెస్ట్ యాక్టర్‌గా ఎన్టీఆర్ అవార్డ్ అందుకోగా ఉత్తమ నటిగా యంగ్ బ్యూటీ శ్రీలీల ఈసారి సైమా అవార్డు సొంతం చేసుకుంది.ధమాకా చిత్రంలో తన అద్భుతమైన పెర్ఫార్మన్స్‌కు శ్రీలీల ఈ అవార్డ్ ఎగరేసుకుపోయింది.

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ధమాకాలో తనదైన డ్యాన్స్‌తో ఒక ఊపు ఊపేసింది శ్రీలీల.

Telugu Dhamaka, Mahesh Babu, Pawan Kalyan, Ravi Teja, Siima, Sreeleela, Tollywoo

ప్రస్తుతం సైమా అవార్డ్స్( SIIMA Awards ) వేడుకలో పింక్ డ్రెస్‌లో మెరిసింది.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.ఆ ఫోటోలను చూసిన అభిమానులు మురిసిపోతున్నారు.

ఇక శ్రీ లీలా ( Sreeleela )డ్యాన్స్ గురించి పేరు పెట్టడానికి లేదు.మరోవైపు ఎన్టీఆర్ డాన్స్ కూడా పేరు పెట్టడానికి లేదు.

అలాంటిది వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే ఇక ఆ సినిమా టాపు లేచిపోద్ది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.వీరి కాంబోలో అదిరిపోయే మాస్ బీట్ పడితే థియేటర్ టాపులు లేచిపోతాయ్.

ప్రజెంట్ టాలీవుడ్‌లో హాట్ కేక్‌గా మారిన శ్రీలీల మహేష్‌ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో ఛాన్స్ అందుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube