మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, 8.30 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది.ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
అయితే, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లు ఆధిక్యంలో ఉన్నారు.పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్కు 4 ఓట్ల ఆధిక్యం లభించింది.
ఇందులో టీఆర్ఎస్కు 228 ఓట్లు రాగా, బీజేపీకి 224, బీఎస్పీకి 10 ఓట్లు వచ్చాయి.
మునుగోడు పోరు హోరాహోరీగా కొనసాగుతోంది.
ఉపఎన్నిక ఫలితాలు రౌండ్ రౌండ్ కు ఆధిక్యాలు మారుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మూడో రౌండ్ ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో ఉంది.
మూడో రౌండ్ ఫలితాల్లో టీఆర్ఎస్ 7,010ఓట్లు, బీజేపీ 7,426, కాంగ్రెస్ కు 1,532 ఓట్లు వచ్చాయి.అయితే మొత్తంగా చూసుకుంటే మూడు రౌండ్లకు టీఆర్ఎస్ కాస్త ముందంజలో ఉంది.
అయితే, నాలుగో రౌండ్ లోనూ బీజేపీనే ఆధిక్యాన్ని కనబరిచింది.నాలుగో రౌండ్ తర్వాత రెండు వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో బీజేపీ ముందుకు వెళ్తోంది.
మరోవైపు కౌంటింగ్ కేంద్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి వెళ్లిపోయినట్లు సమాచారం.







