ఇటీవల రోజుల్లో ఇయర్ ఫోన్స్( Earphones ) వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.మొబైల్ తో నేరుగా కనెక్ట్ అయ్యే వైర్డ్ ఇయర్ ఫోన్స్ కావచ్చు లేదా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకునే వైర్లెస్ ఇయర్ బర్డ్స్ కావచ్చు.
ఏవైనా కానీ రోజురోజుకు వీటికి ఆదరణ పెరుగుతోంది.యూత్, ఉద్యోగస్తులే కాదు పిల్లలు, హౌస్ వైఫ్స్ ఇలా అందరూ ఇయర్ ఫోన్స్ ను వినియోగిస్తున్నారు.
సంగీతం వినడానికి, వీడియోస్ చూసేటప్పుడు పక్కన వారి డిస్టబెన్స్ లేకుండా వాయిస్ స్పష్టంగా వినడానికి ఇయర్ ఫోన్స్ ను వాడుతుంటారు.
అయితే కొందరు నిత్యం గంటలు తరబడి ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తుంటారు.
అలాంటి వారు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.ఇయర్ ఫోన్స్ వాడొచ్చు కానీ గంటలు తరబడి ఉపయోగించడం వల్ల రకరకాల సమస్యలు తలెత్తుతాయి.
అందులో వినికిడి లోపం( Hearing Impairment ) ముందు వరుసలో ఉంటుంది.ఇయర్ ఫోన్స్ నుండి పెద్ద శబ్దాలు మీ లోపలి చెవిలోని కణాలను దెబ్బతీస్తాయి.
ఇది శాశ్వత వినికిడి నష్టానికి దారి తీస్తుంది.

ఇయర్ ఫోన్స్ ను అధికంగా వినిగించేవారిలో చెవి ఇన్ఫెక్షన్లు( Ear Infections ) ఎక్కువగా తలెత్తుతాయి.ఎందుకంటే, ఇయర్ ఫోన్స్ ను గంటలు తరపడి పెట్టుకోవడం వల్ల అవి చెవి లోపలకు గాలి వెళ్లకుండా అడ్డుకుంటాయి.దాంతో తేమ పెరిగి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
ఫలితంగా చెవి ఇన్ఫెక్షన్స్ తలెత్తుతాయి.

అలాగే ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల చెవిలో నొప్పి( Ear Ache ) మరియు పుండ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి.అధిక వాల్యూమ్లలో ఇయర్ఫోన్లను ఉపయోగించడం వల్ల తలతిరగడం, ఒత్తిడి వంటివి ఇబ్బంది పెడతాయి.ఇయర్ఫోన్ల నుండి వచ్చే ధ్వని మీ నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది, ఇది దృష్టి లోపానికి దారితీస్తుంది.
ఇక ఇయర్ ఫోన్లను ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించడానికి.వాల్యూమ్ అవుట్‌పుట్‌ను తగ్గించండి.మీ చెవులను క్రమం తప్పకుండా క్లీన్ చేసుకోండి.ఇయన్ ఫోన్స్ వినియోగ సమయాన్ని తగ్గించండి.