తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) 2024 ఎన్నికలకు అన్ని రకాలుగా రెడీ అవుతున్న శాంతి తెలిసిందే.వచ్చే ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు.ప్రస్తుతం జనసేనతో( Janasena ) సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో పై చర్చలు జరుపుతున్నారు.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా “రా.కదలి రా”( Ra Kadalira ) సభలు నిర్వహిస్తున్నరు.మొన్నటి వరకు అరకు ఇంకా మండపేట, గుడివాడ నియోజకవర్గలలో…“రా.కదలి రా” సభలు నిర్వహించటం జరిగింది.ఇదిలా ఉంటే ఈ నెల 27 నుంచి మూడు రోజులపాటు “రా కదలిరా” మహా సభలు నిర్వహించనున్నారు.
ఈ మూడు రోజులలో ఆరు నియోజకవర్గాలలో పర్యటించడానికి రెడీ అవుతున్నారు.ఈనెల 27న పిల్లేరు, ఉరవకొండ ఆ తర్వాత 28వ తారీకు నెల్లూరు రూరల్, పత్తికొండలో అనంతరం 29వ తారీకు రాజమండ్రి రూరల్,( Rajahmundry Rural ) పొన్నూరులో ( Ponnur ) నిర్వహించే సభలో చంద్రబాబు పాల్గొంటారు.రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ “రా కదలిరా” బహిరంగ సభలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
ఈ సభలలో వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ( TDP ) అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయనున్నారో… అనేక హామీలు ప్రకటిస్తున్నారు.