వాటే ఐడియా: ఇలా చేస్తే నీ ఆటో ఎందుకు ఎక్కరు గురూ.. వైరల్ వీడియో.

సూర్యుడు వల్ల ఎంత వేడి ఉంటుందో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇకపోతే ప్రస్తుతం ఏదైనా అవసరమైన పనులు ఉంటే తప్పించి బయటకి వచ్చేవారే లేకుండా పోయారు.

 Driver Arranged Gunny Bags Grass On Auto To Get Relief From Summer Heat Details,-TeluguStop.com

ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఎండను తట్టుకోవడం చాలా కష్టం.దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు డ్రైవర్లు( Drivers ) ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు.

తమ వాహనాలను ఎండలో వేడెక్కకుండా ఉండేందుకు రకరకాల జాగ్రత్తలు తీసుకోవడం మీరు గమనించవచ్చు.అలాంటి వాహనాల వీడియోలు కూడా ఆన్‌లైన్‌ లో వైరల్ గా మారడం చూసే ఉంటాము.

తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్గా మారింది.ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఓ ఆటో డ్రైవర్( Auto Driver ) తీసుకుంటున్న జాగ్రత్తలపై నెటిజన్లు అవాక్కవుతున్నారు.

ఇందుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది.వేసవి ఎండలను ఎదుర్కొంటూ ఓ వ్యక్తి తన ఆటోను( Auto ) చల్లగా ఉంచేందుకు కొత్తగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు.చివరకు అతనికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది.అతను ఇంటి ఇంట్లో ఓ మూలాన పడేసిన గోనె సంచులను( Jute Bags ) తీసుకోని ఆటో టాప్‌ కు సరిపడా వాటిని కత్తిరించుకున్నాడు.

ఆపై అతను వాటి మధ్యలో గడ్డిని పెరిగేలా ఏర్పాట్లు చేసాడు.ఆ తర్వాత గోనె సంచులను ఆటోకు అటాచ్ చేశాడు.

దాంతో ఈ ఆటో అందంగా కనిపించడమే కాకుండా, దానిలోని ప్రయాణికులను చల్లగా ఉంచుతుంది.ఈ వినూత్న ఆలోచన వేసవిలో చల్లని ఎండలో ప్రయాణించడమే కాకుండా ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఇస్తుంది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలలో చక్కర్లు కొడుతోంది.సోషల్ మీడియా వినియోగదారులు ఈ అంశంపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.“మీ ఆలోచనల చాలా బాగుంది బ్రదర్”… అని ఒకరు అనగా.“ఇది సాధారణ ఆటో కాదు, ఇది ఏసీ ఆటో ఆటో ” అని… మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోకు ప్రస్తుతం 6 మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube