Dhanteras : ధంతేరాస్ లో బంగారంతో పాటు చీపురును ఎందుకు కొనుగోలు చేస్తారంటే..?

దీపావళికి రెండు రోజుల ముందు ధంతేరాస్ ను జరుపుకుంటారు.ధంతేరాస్( Dhanteras ) లో అన్ని రకాల వస్తువుల కొనుగోళ్లు ఊపందుకుంటాయి.

 Why Do They Buy Broom Along With Gold In Dhanteras-TeluguStop.com

ఒక కొత్త వస్తువు కొనుగోలు చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.అయితే ధంతేరాస్ రోజు బంగారం వంటి విలువైన వస్తువులను కొనడమే కాకుండా చీపురును కొనుగోలు చేసే సంప్రదాయం కూడా ఉందని చాలా మందికి తెలియదు.

ఈ ఆచారం వెనుక ఉన్న నమ్మకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఏడాదిలో ఈ సమయంలో చేసే కొనుగోళ్లు దీర్ఘకాలిక రాబడినీ ఇస్తాయని ప్రజలు నమ్ముతారు.

దీపావళి పండుగ ధంతేరాస్ నుంచి మొదలవుతుంది.

Telugu Bhakti, Devotional, Dhana Triodasi, Dhanteras, Goddess Lakshmi, Krishnapa

దీనిని సాధారణంగా ధన త్రయోదశి( Dhana Triodasi ) అని కూడా అంటారు.హిందూ ధర్మంలో ధన త్రయోదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఈ పండుగను హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి ( Krishna Paksha Triodasi )11వ రోజున జరుపుకుంటారు.

ఈ సంవత్సరం నవంబర్ 10వ తేదీన ధంతేరాస్ జరుపుకోనున్నారు.అలాగే ఆ రోజున లక్ష్మీదేవిని, కుబేరున్ని పూజిస్తారు.చాలా మంది ప్రజలు ఈ రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చీపురు లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు.

అలాగే చీపురు కొనడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది.చీపురు కొనడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు రాకుండా చేస్తుందని ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

Telugu Bhakti, Devotional, Dhana Triodasi, Dhanteras, Goddess Lakshmi, Krishnapa

ఇంటిని శుభ్రం చేయడానికి చీపురు ను సాధారణంగా ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు.ఆ ఇల్లు లక్ష్మీదేవిని( Goddess Lakshmi ) ఆకర్షిస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.అయితే ధంతేరాస్ చీపురు కొనడం శుభ ప్రదంగా భావిస్తారు.ధంతేరాస్ రోజున చీపురు కొన్న తర్వాత దానికి తెల్లటి దారం కట్టాలి.ఇలా చేయడం వల్ల కుటుంబానికి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ రక్షణ కల్పిస్తుందని నమ్ముతారు.అయితే చీపురు మురికి చేతులతో తాగకుండా జాగ్రత్తగా ఉండాలి.

చీపురు ముట్టుకునే ముందు ఎప్పుడూ చేతులను శుభ్రం చేసుకోవాలి.ఆ తర్వాత కూడా దాన్ని శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి.

చీపురు నిలబడి ఎప్పుడూ ఉంచకూడదు.ఇలా ఉంచడం పండితులు అశుభంగా భావిస్తారు.

ముఖ్యంగా చెప్పాలంటే చీపురు ఎవరికి కనిపించని ప్రదేశంలో ఉంచాలని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube