రాజన్న సిరిసిల్ల జిల్లా: విలాసవంతమైన జీవితాలు గడపడానికి బ్యాంక్ రుణాలు, ఆన్లైన్ ఉద్యోగల పేరుతో సైబర్ మోసాలు చేస్తు ఇద్దరు అంతర్ జిల్లా సైబర్ నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహాజన్ తెలిపారు.జస్ట్ డయల్ యాప్ ద్వారా రుణాలు అవసరం ఉన్న వారి ఫోన్ నంబర్స్ తీసుకొని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు.నిందుతుల నుండి రు.1,50,000 నగదు, బెలోనా కార్,నాలుగు మొబైల్ ఫోన్స్,05 మొబైల్ సిమ్ కార్డ్స్, ఒక చెక్ బుక్,3 ఏటీఎం కార్డ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ తెలిపారు.నల్గొండ జిల్లా, దామాడిచెర్ల మండలం (కొండూరు జానా రరెడ్డి) కాలానికి చెందిన ధనవాత్ రమేష్, వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడని, వ్యవసాయం వలన వచ్చే డబ్బులు సరిపడక హైద్రాబాద్ లోని హయత్ నగర్ లోని లెక్చరర్ కాలనిలో అద్దెకు ఉంటూ డ్రైవర్ గా పని చేస్తూ వచ్చే డబ్బులు తన జల్సాలకు సరిపడక సులువుగా డబ్బులు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో గతంలో జస్ట్ డయల్ యాప్ లో రిజిస్టర్ చేసుకొని రుణాలు అవసరం ఉన్నవారు
సంబంధిత యాప్ లో తనిఖీ చేయగా వారి ఫోన్ నెంబర్ లు తీసుకొని లోన్ అవసరం ఉన్నవారికి , లోన్ రిజెక్ట్ అయిన వారికి సివిల్ స్కోర్ తక్కువ ఉన్నవారి డీటెయిల్స్ జస్ట్ డయల్ ఆప్ ద్వారా తీసుకొని హైదరాబాదులోని ఎస్ బి ఐ మాదాపూర్ బ్రాంచ్ నందు రుణాలు ఇపిస్తానని చెపుతూ, తన గ్రామస్థుడైన ధనవాత్ రాజు హైదరాబాద్ లోని ఎల్ బి నగర్ లో ఉంటూ డ్రైవర్ పని చేస్తూ ఉన్న రాజుతో కలసి వారి దగ్గర ఉన్న నెంబర్లతో లోన్ డబ్బులు అవసరం ఉన్నవారికి ఫోన్ చేసి మోసం చేస్తూ వచ్చిన డబ్బులతో, అదేవిధంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని, బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తూ వచ్చిన డబ్బులతో గోవా ఇతర రాష్ట్రాలకు వెళుతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని తెలిపారు.
స్టేషన్ లో ఫిర్యాదుతో వెలుగులోకి.

ధనవాత్ రమేష్,రాజు వారి యెక్క నంబర్స్ ద్వారా రుణాలు అవసరం ఉన్నవాళ్లకు ఫోన్ కాల్ చేయగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పెట్ చెందిన ముక్తవరం పద్మావతికి చేయడంతో, పద్మావతిని రమేష్ ఎస్ బీ ఐ మాదాపూర్ బ్రాంచ్ బ్యాంకు మేనేజర్ సుధీర్ రెడ్డి అని,రాజు ఎస్ బీ ఐ ఫీల్డ్ ఆఫీసర్ రామ్ రెడ్డి అని పరిచయం చేసుకొని బ్యాంక్ నుండి 26,00,000 లక్షల రూపాయలు రుణం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి పద్మావతిని నమ్మించి మొదట ప్రాసెసింగ్ ఫీజు, లోన్ లాగిన్ పేమెంట్ కొరకు, ఇన్సూరెన్స్ ఫీ అని అడుగగా ఇలా వివిధ దఫాలుగా పద్మావతి రమేష్ రాజ్ కురుములను నమ్మి మొత్తం రూపాయలు 3,58,795 రూపాయలు రమేష్ యొక్క బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర, మిర్యాలగూడ బ్రాంచ్ అకౌంట్ నెంబర్ 52 2 0 1 3 4 8 3 9 0 లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ కి యూ.పి.ఐ ద్వారా పంపించారు.
రమేష్, రాజు లు పలు కేసులలో జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన తరువాత డబ్బులు అవసరం పడడంతో పద్మావతికి కాల్ చేసి 22,000 వేల రూపాయలు పంపించమని అడుగగా పద్మావతికి రమేష్ ,రాజ్ ల మీద అనుమానం వచ్చి గంభీరావుపెట్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. సి.ఐ శశిధర్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఆర్.ఎస్.ఐ జూనైద్ , ఎస్.ఐ మహేష్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయగా పద్మావతిని నమ్మించడానికి ఒక కార్ లో చెక్ బుక్ , 3 ఏ టి ఎం కార్డ్స్,మూడు మొబైల్ తీసుకొని వచ్చే దారిలో లింగన్నపేట్ క్రాస్ రోడ్ వద్ద శనివారం అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రెడ్ కలర్ బెలూన్ కార్, లెదర్ బ్యాగ్, 3 ఐసిఐసిఐ బ్యాంక్ చెక్ బుక్, మూడు ఏటీఎం కార్డ్స్, నాలుగు మొబైల్స్,సిమ్ కార్డ్స్,లక్ష ఐబై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకోని వారిని ఈ రోజు రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు.
ధనవాత్ రమేష్, రాజు ల మీద సైబరాబాద్, అల్వాల్, బేగంపేట గోపాలపురం పిఎస్, మహంకాళి పిఎస్, రాజేంద్రనగర్ పిఎస్, కామారెడ్డి, ఖమ్మం పోలీస్ స్టేషన్ లలో 15 కేసులు నమోదు కగా పలు కేసుల్లో జైలు జీవితం గడిపారు.అంతే కాక ధనవాత్ రమేష్ ఫోన్ నెంబర్ మీద ఎన్ సి ఆర్ పి ప్రోట్రల్ లో దర్యాప్తు చేయగా 19 మాయక ప్రజల దగ్గర రుణాలు,ఉద్యోగాల పేరిట సుమారు 20 లక్షల వరకు మోసం చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
ఈ సమావేశంలో డిఎస్పీ ఉదయ్ రెడ్డి, సి.ఐ శశిధర్ రెడ్డి, ఎస్.ఐ మహేష్, ఆర్.ఎస్.ఐ జునైద్ సిబ్బంది ఉన్నారు.







