కోరినా కోరికలు తీర్చే దేవతలు ఆదివాసుల ఆరాధ్య దేవతలు సమ్మక్క సారలమ్మల మినీ మేడారం జాతర బుధవారం రోజు మండ మెలిగే ప్రతెక్య పూజలతో మొదలైంది.సంవత్సరం తర్వాత మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మండ మెలిగే పండుగ నిర్వహిస్తూ ఉంటారు.
మండ మెలిగే పండుగను మినీ జాతరగా చేయడం ఆనవాయితీగా వస్తుంది.ఈ మేరకు ఫిబ్రవరి 1 మేడారంలోని సమ్మక్క గుడి, కన్నేపల్లి లోని, సారలమ్మ గుడి, గోవిందరాజులు గుడి, పగిడిద్ద రాజుల గుళ్ళలో గంగా జలంతో శుభ్రపరిచి పూజా సామాగ్రిని శుద్ధి చేసి వాన దేవతలకు వారి సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు.
జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.
ఆ తర్వాత గ్రామదేవతలైన బొడ్రాయి ఎర్రమ్మ, పోచమ్మ పోతురాజులకు ప్రత్యేకంగా పూజలు చేసి గ్రామ రక్షణ కోసం మేడారం గ్రామానికి ఇరువైపులా బూరుగు చెట్లను ధ్వజ స్తంభాలుగా నిలిపి, మామిడి ఆకుల తోరణాలతో రక్షాబంధన్ చేస్తారు.రాత్రి సమయంలో మేడారంలో సమ్మక్క సారలమ్మల గద్దేల కుటుంబ సభ్యులతో కలిసి డోలు వాయిద్యాలు లాంటి సంప్రదాయ సంగీత సాధనలతో వన దేవతలకు పూజలు చేస్తూ జాగారం చేస్తారు.
గద్దెలపై కొలువుదిరిన అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో మేడారం గ్రామం జనసంద్రంగా కనిపిస్తుంది.వన దేవతల దర్శనం కోసం మేడారం చేరుకున్న భక్తులు జంపన్న వాగులో పుణ్య స్థానాలు చేసి అక్కడ నుంచి తమ మొక్కుల మేరకు పసుపు, కుంకుమ, చీర, సారే, ఎత్తు బంగారంతో అమ్మవారి గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు సమర్పించుకుంటున్నారు.టీ యస్ ఆర్టీసీ హనుమకొండ నుంచి మేడారనికి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులను రాకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
DEVOTIONAL