Sridhar Ramaswamy : మరో అమెరికన్ కంపెనీకి సీఈవోగా భారతీయుడు .. ఎవరీ శ్రీధర్ రామస్వామి ..?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు( Indians ) ప్రస్తుతం అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే.

ప్రత్యేకించి అమెరికన్ కార్పోరేట్ ప్రపంచాన్ని భారతీయులు ఏలుతున్నారు.

సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, పరాగ్ అగర్వాల్, శంతను నారాయణ్, అరవింద్ కృష్ణ, అజయ్ బంగా, మనీష్ శర్మ, లీనా నాయర్ వంటి భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు అమెరికన్ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఈ కోవలో మరో దిగ్గజ అమెరికన్ కంపెనీ ‘‘స్నో ఫ్లేక్ ’’ ( Snow Flake )సీఈవో, డైరెక్టర్ల బోర్డు సభ్యుడిగా శ్రీధర్ రామస్వామి( Sridhar Ramaswamy ) నియమితులయ్యారు.

స్లో ఫ్లేక్.క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత సేవలను అందిస్తుంది.ఇప్పటి వరకు సీఈవోగా వ్యవహరించిన ఫ్రాంక్ స్లూట్‌మన్ స్థానంలో రామస్వామి బాధ్యతలు చేపట్టనున్నరు.57 ఏళ్ల శ్రీధర్.భారత్‌లోని తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి పట్టణంలో జన్మించారు.1989లో అమెరికాకు వెళ్లేముందు.మద్రాస్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు.

యూఎస్‌లో అడుగుపెట్టిన తర్వాత.బ్రౌన్ యూనివర్సిటీలో( Brown University ) కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ చేశారు.

Advertisement

శ్రీధర్ రామస్వామి తన కెరీర్‌ను టెల్ కార్డియా టెక్నాలజీస్‌లో( Tel Cardia Technologies ) ప్రారంభించారు.అనంతరం బెల్ ల్యాబ్స్, లూసెంట్ టెక్నాలజీస్‌లో టెక్నికల్ స్టాఫ్ సభ్యునిగానూ పనిచేశారు.ఎపిఫనీలో ఇంజనీరింగ్ డైరెక్టర్‌గా, గూగుల్‌లో 15 ఏళ్లు వివిధ హోదాలలో విధులు నిర్వర్తించారు.2018లో గూగుల్‌ను విడిచిపెట్టిన తర్వాత .రామస్వామి వెంచర్ క్యాపిటల్ సంస్థ గ్రేలాక్ పార్ట్‌నర్స్‌లో భాగస్వామిగా చేరారు.అనంతరం మాజీ గూగుల్ ఎగ్జిక్యూటివ్ వివేక్ రఘునాథన్‌తో( Vivek Raghunathan ) కలిసి ‘‘ Neeva ’’ను స్థాపించారు.

నీవా అనేది యాడ్ ఫ్రీ, సబ్‌స్క్రిప్షన్ ఓన్లీ సెర్చ్ ఇంజన్.ఇది యాడ్ సపోర్ట్ సెర్చ్ ఫ్లాట్‌ఫాం పరిమితులను పరిష్కరించడానికి ప్రారంభించారు.2021లో స్థాపించబడిన ఈ కంపెనీని 2023లో స్నో ఫ్లేక్ కొనుగోలు చేసింది.

రామస్వామి భార్య , ఇద్దరు కుమారులతో కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో తన కుటుంబంతో నివసిస్తున్నారు.ఆఫీసులో ఎంత బిజీగా వున్నప్పటికీ, తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంపై ఆయన శ్రద్ధ చూపెడుతుంటారు.తీరిక సమయాల్లో పుస్తకాలను చదవడం శ్రీధర్ హాబీ.

లింకన్ జీవిత చరిత్ర, క్వింగ్ రాజవంశం, మాస్టర్ స్విచ్ వంటి వాటిని ఆయన చదివారు.

వైట్ హౌస్ గేట్‌ను ఢీకొట్టిన వ్యక్తి.. కట్ చేస్తే మృతి..?
Advertisement

తాజా వార్తలు