యశోద జయంతి రోజున అందరూ యశోద, శ్రీకృష్ణుని బాల రూపాన్ని పూజిస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల బిడ్డకు ఎప్పుడు ఇబ్బంది కలగదని, శ్రీకృష్ణుడే బిడ్డను రక్షిస్తాడని చాలామంది ప్రజలు నమ్ముతారు.
ఇంకా చెప్పాలంటే సంతానం కలగాలని కోరికతో చాలా మంది స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు కూడా చేస్తూ ఉంటారు.శ్రీకృష్ణుడు తల్లి యశోదనీ మమతా విగ్రహం అని పిలుస్తారు.
యశోద జయంతి ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షంలోని ఫిబ్రవరి 12 2023న మన దేశవ్యాప్తంగా ప్రజలందరూ జరుపుకుంటున్నారు.కృష్ణుడు దేవకి గర్భం నుంచి పుట్టి ఉండవచ్చు.
కానీ తల్లి యశోద అతన్ని పెంచింది.దేశంలోని వివిధ ప్రాంతాల్లో యశోద జయంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఈ రోజున మహిళలు తమ పిల్లల దీర్ఘాయువు, రక్షణ, ఉజ్వల భవిష్యత్తు కోసం కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు.దేశంలోని కృష్ణ ఆలయంలో బాలగోపాలుడికి తల్లి యశోదకు ప్రత్యేక పూజలు చేస్తారు.

ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి, స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ఉపవాస వ్రతం చేస్తారు.ఈ జన్మ దినోత్సవం రోజున భారతదేశంతో పాటు ఇంకా ఎన్నో దేశాలలోని కృష్ణ దేవాలయాలలో యశోద జయంతిని ఘనంగా జరుపుకుంటారు.ముఖ్యంగా ఈ పండుగను గుజరాత్, మహారాష్ట్ర, దక్షిణ భారత దేశంలో మరింత ఘనంగా జరుపుతారు.ఈ ప్రత్యేక జన్మదినోత్సవం రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించి ఉపవాసం చేయడం ఎంతో మంచిది.
ఎర్రటి వస్త్రాన్ని పరిచి తల్లి యశోద ఓడిలో శ్రీకృష్ణుడు కూర్చున్న చిత్రపటాన్ని పూజిస్తారు.ఈ రోజున 11 మంది ఆడపిల్లలకు భోజనం పెట్టడం మంచిది.పూజా పూర్తయిన తర్వాత ఆవుకు పచ్చిమేత తినిపిస్తే ఎంతో మంచిది.ఇలా చేయడం వల్ల ఆ ఇంట శుభం కలుగుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.