తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు మరియు ప్రేక్షకులకు ఇండస్ట్రీ వర్గాల వారికి సుపరిచితురాలు అయిన అతి లోక సుందరి శ్రీదేవి నట వారసురాలుగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.సౌత్ నుండి వచ్చిన చాలా ఆఫర్ల ను బాలీవుడ్ సినిమా ల కోసం అంటూ కాదు అనుకున్న జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్ సినిమా ల్లో నటించేందుకు ఓకే అన్నట్లుగా తెలుస్తోంది.
బాలీవుడ్ లో ఈ అమ్మడు ప్రస్తుతం రెండు మూడు సినిమా ల్లో నటిస్తుంది.ఆ సినిమా లు మాత్రమే కాకుండా మరి కొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి.
ఇన్ని సినిమా లతో బిజీగా ఉన్న ఈ అమ్మడు చిన్న కార్యక్రమాల నుండి పెద్ద అవార్డు ఫంక్షన్స్ వరకు ఎంతో హడావుడిగా కాస్ట్యూమ్స్ తో మైమరపించే విధంగా రెడీ అవుతుంది.కొన్ని సార్లు మాత్రం ఈమె వేసుకునే డ్రస్ అస్సలు బాగుండదు అనే విమర్శలు వస్తూ ఉన్నాయి.
తాజాగా ఒక ప్రముఖ అవార్డు వేడుకలో ఈమె ధరించిన డ్రస్ విషయంలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఒకరిని కాపీ కొట్టడం లేదంటే చెత్త డ్రస్ వేసుకోవడం ఈ రెండు తప్ప మరేం నీకు రావా అంటూ సోషల్ మీడియా లో జనాలు చేస్తున్న విమర్శలు వైరల్ అవుతున్నాయి.
నెట్టింట జాన్వీ కపూర్ ఫోటో లు మరియు వీడియో లు రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటాయి.తాజాగా జాన్వీ కపూర్ వేసుకున్న డ్రస్ లు కూడా చాలా వైరల్ అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో కొందరు జాన్వీ కపూర్ ను ప్రశంసిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఎప్పటిలాగే జాన్వీ కపూర్ ను కనీసం డ్రస్సింగ్ సెన్స్ లేదు అంటూ కాస్త ఘాటుగానే విమర్శిస్తున్నారు.అందంగా ఉన్నంత మాత్రాన ఏ డ్రస్ వేసుకున్న సెట్ అవ్వదు అన్నట్లుగా జాన్వీ కి చాలా మంది కౌంటర్ ఇస్తున్నారు.







