బోయపాటితో మహేష్.. ఈసారి పక్కా అట..!

టాలీవుడ్ లో ఉన్న మాస్ డైరక్టర్స్ లో ఒకరు బోయపాటి శ్రీను. ఆయన సినిమా అంటే మాస్ ఆడియెన్స్ కి పండుగే అని చెప్పొచ్చు.

 Mahesh Boyapati Srinu Movie Is On Discussion, Akhanda, Boyapati Srinu, Mahesh, S-TeluguStop.com

ఈమధ్యనే అఖండతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉన్నారు.ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ తో బోయపాటి శ్రీను సినిమా దాదాపు కన్ ఫర్మ్ అని అంటున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న బోయపాటి, మహేష్ కాంబో సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రం సినిమా చేస్తున్నారు.

ఆ తర్వాత రాజమౌళి సినిన్మా లైన్ లో ఉంది.ఈ రెండు సినిమాల తర్వాత మహేష్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తాడని టాక్.

ఇద్దరి మధ్య ఈ మధ్య చర్చలు కూడా జరిగాయని.మహేష్ తప్పకుండా బోయపాటితో సినిమా చేస్తాడని అంటూన్నారు.

బోయపాటి మాస్ మూవీలో మహేష్ లాంటి హీరో చేస్తే ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. బోయపాటి శ్రీను అల్లు అర్జున్ తో సరైనోడు సినిమా సీక్వల్ ని కూడా చేయాలని చూస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube