టీఎస్ బీ పాస్ దేశంలో ఎక్కడా లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.తెలంగాణలో 21 రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నామని తెలిపారు.
అనుమతులు లేని లే ఔట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.హౌసింగ్ డిపార్డుమెంట్ ను ఇతర శాఖలో విలీనం చేసినట్లు పేర్కొన్నారు.ధరణితో మీ భూములకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.111 జీవో తొలగించి 69 జీవో తెచ్చామన్న కేటీఆర్ కేసు హైకోర్టులో ఉందని వెల్లడించారు.ఉస్మాన్ సాగర్ ను ఎట్టి పరిస్థితుల్లో కలుషితం కానివ్వమని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.త్వరలోనే పూర్తి కార్యాచరణను ప్రకటిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
.






