ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఒక సెలబ్రిటీ చనిపోయారు బాధ నుంచి తీరుకునే లోపే మరో సెలబ్రిటీ చనిపోతున్నారు.
కొందరు సీనియర్స్ యాక్టర్స్ చనిపోతుండగా మరికొందరు యువ నటులు చనిపోతున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా మరో నటుడి మరణవార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.34 ఏళ్ల వయసులోనే ఆ నటుడు ఇంట్లో శవమై కనిపించడం అందరిని షాక్ కు గురి చేసింది.ఆ నటుడు ఎవరు అసలు ఏమయ్యింది అన్న విషయానికి వస్తే.

హాలీవుడ్ హైట్స్, డేస్ ఆఫ్ అవర్ లైవ్స్ లాంటి మంచి సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు నటుడు కోడి లాంగో.అలాగే నటుడిగా హాలీవుడ్ హైట్స్, వైల్డ్ ఫ్లవర్, నాట్ టుడే, పిరానా 3డి, డెత్ హౌస్, ప్రమోటెడ్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.అయితే తాజాగా కోడి లాంగో టెక్సాస్‌లోని ఆస్టిన్ లో తాను నివసిస్తున్న ఇంట్లోనే విగతజీవిగా కనిపించాడని అతని ప్రతినిధి అలెక్స్ గిట్టెల్సన్ మీడియాకు సమాచారం అందించారు.ప్రస్తుతం లాంగో వయసు 34 ఏళ్లు.
ఇంత చిన్న వయసుకే అలా మరణించడం బాధాకరమని చెప్పవచ్చు.

కాగా కోడి లాంగో కి భార్యా పిల్లలు కూడా ఉన్న విషయం తెలిసిందే.తాజాగా అతను మరణించడంతో అదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ అతని భార్య స్టెఫానీ లాంగో, పిల్లలు బాగా మిస్ అవుతున్నాం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.అలాగే లాంగో పిల్లలకు ఎప్పుడు గొప్ప తండ్రిగా గుర్తుంటాడని ఎప్పటికీ లాంగోని ప్రేమిస్తూనే ఉంటామని స్టెఫానీ లాంగో రాసుకొచ్చారు.
అయితే కోడిలాంగో మృతుకి గల కారణాలు ఇంకా తెలియలేదు.







