జగన్ చేతకాని తనం వల్లనే ఇదంతా ?

ఒంటెద్దు పోకడ జగన్ మోహన్ రెడ్డి కి అతిపెద్ద మైనస్ పాయింట్ అని చెబుతున్నారు అందరూ, విమర్శకులు మొదటిగా జగన్ ని ఎకేయ్యాలి అనుకున్నప్పుడు ఎత్తే మ్యాటర్ లక్ష కోట్ల ఆస్తి అవగా జగన్ ని సొంత జనం ఏదైనా అనాలి అనుకున్నప్పుడు ఎత్తే విషయం ఇదే .ఒంటెద్దు పోకడ రాజకీయ నాయకులకి మంచిది కాదు.

 Jagan ’s Incompetence Lead This-TeluguStop.com

కానీ జగన్ మోహన్ రెడ్డి కి అది తన తండ్రి వై ఎస్ రాజశేకర రెడ్డి నుంచి ఒచ్చింది ఏమో అనిపిస్తూ ఉంటుంది .ఇలాంటి ఒంటెద్దు పోకడ , కలుపుకుంటూ పోకపోవడం వల్లనే జగన్ ఇప్పుడు ఎమ్మెల్యే లని కోల్పోతున్నారు అనే వాదన నడుస్తోంది.

తాజాగా జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉన్న జ్యోతుల నెహ్రూ టీడీపీ గూటికీ చేరిన సంగతి తెలిసిందే.పార్టీ మారిన వెంటనే.పుట్టింటికి వచ్చినట్లుగా వ్యవహరించిన ఆయన.తన ఎక్స్ అధినేత జగన్ గురించి సూటిగా తగిలే వ్యాఖ్యలు చేయటం గమనార్హం.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదినేతకు మెచ్యూరిటీ తక్కువన్న భావన వచ్చేలా విమర్శలు చేశారు.అంతేకాదు.జగన్ ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తారని.అసెంబ్లీలో ఉప నాయకుడిగా ఉన్న తన మాటకు కూడా విలువ ఇవ్వలేదని.

తనను దూరం పెట్టారంటూ వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు.

తాను తప్ప మిగిలిన వారంతా జీరో అనే నాయకుడి దగ్గర ఎంతకాలం పని చేసినా పార్టీ అభివృద్ధి కాదన్న మాటా జ్యోతుల నోటి నుంచి రావటం చూస్తే.ఏ మాటలు జగన్ ను బాగా డ్యామేజ్ చేస్తాయో అవే మాటల్ని చెప్పటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube