ఆ ఇద్ద‌రికీ మ‌ళ్లీ నిరాశే మిగిలిందే.. మండ‌లి నుంచి కేబినెట్ కు ఎవ‌రు..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు కొన్ని సార్లు సొంత పార్టీ నేత‌ల‌నే తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి.ఇక‌పోతే జ‌గ‌న్ సీఎం అయిన తొలినాళ్ల‌లో మండ‌లి ర‌ద్దు అంటూ ప్ర‌క‌టించేసి అంద‌రికీ షాక్ ఇచ్చారు.

 Did You Remain Disappointed Again Who Is The Cabinet From The Council Ycp, Ap Po-TeluguStop.com

మ‌రీ ముఖ్యంగా మండ‌లి నుంచి వైసీపీలో ఎమ్మెల్సీలుగా ఉన్న వారికి ఇది పెద్ద నిరాశే అయిపోయింది.ఇక మండ‌లి నుంచి అప్ప‌టికి మంత్రులుగా ఉన్న ఇద్దిరికీ ఇది కోలుకోలేని షాక్ ఇచ్చింది.

పిల్లి సుభాష్ చంద్రబోస్ అప్ప‌టికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు.మోపిదేవి వెంకటరమణ మంత్రి ప‌ద‌విలో ఉన్నారు.

అయితే ఈ ఇద్ద‌రికీ ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఉండ‌బోవ‌ని తేల్చేయ‌డంతో వారిద్ద‌రూ మంత్రి పదవుల నుంచి తప్పుకున్నారు.ఇక ఇన్ని రోజుల‌కు జ‌గ‌న్ మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యాన్ని వెన‌క్కు తీసుకుంటున్నారు.

దీంతో మ‌ళ్లీ మండ‌లి స‌భ్యుల్లో ఆశ‌లు రేకెత్తుతున్నాయి.కానీ ఈ ఇద్ద‌రికీ మాత్రం మ‌ళ్లీ మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌బోవ‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టికే వారికి రాజ్యసభ మెంబర్ షిప్ ఇచ్చిన సీఎం జగన్ వారిని మాత్రం మంత్రి ప‌ద‌వుల్లోకి తీసుకునే ఛాన్స్ లేద‌ని తెలుస్తోంది.ఇక‌పోతే మండ‌లి నుంచి మ‌రో ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు దక్కుతాయని చెబుతున్నారు.

Telugu Ap, Cm Jagan, Council, Ysrcp-Telugu Political News

ఇందులో మ‌రీ ముఖ్యంగా జిల్లాల వారీగా కొంద‌రి పేర్లు వినిపిస్తున్నాయి.సి.రామచంద్రయ్య, వంశీ క్రిష్ణ శ్రీనివాస్ యాదవ్ అలాగే పాలవలస విక్రాంత్ లాంటి వారి పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి.ఈ ముగ్గురిలో ఎవ‌రికో ఒక‌రికి క‌చ్చితంగా కేబినెట్ ప‌ద‌వి ఖాయ‌మ‌నే వార్త‌లు ఇప్పుడు వైసీపీలో మిన్నంటాయి.

అలాగే దువ్వాడ శ్రీనివాస్ లాంటి నేత పేరు కూడా ప్ర‌చారంలో ఉంది.వీరంద‌రూ రాజ‌కీయంగా జ‌గ‌న్‌కు ఎప్ప‌టి నుంచో అండ‌గా ఉంటున్న వారే కావ‌డంతో వారిలో ఎవ‌రికైనా ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌నే న‌మ్మకం వారిలో బ‌లంగా ఉంది.

మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube