ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు..!!

ఈనెల 12వ తారీకున చంద్రబాబు( Chandrababu ) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే.తెలుగు రాజకీయాలలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ రికార్డు కూడా సృష్టించటం జరిగింది.

 Prime Minister Modi Visit To Andhra Pradesh Is Over, Chandrababu, Modi, Andhra P-TeluguStop.com

ఏపీలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం కూటమి చారిత్రాత్మకమైన విజయాన్ని అందుకోవటం సంచలనం సృష్టించింది.తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇటీవల జరిగిన ఎన్నికలను హ్యాండిల్ చేశారు.

ఎట్టి పరిస్థితులలో గెలవాలని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా బీజేపీ, జనసేన ( BJP , Jana Sena )పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చాలా కష్టపడ్డారు.

రోజుకి 3 నుంచి 4 సభలలో పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయి.మండుటెండల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేశారు.ఎట్లాగైతే చంద్రబాబు పడ్డ కష్టానికి.ఏపీ ప్రజలు ఎవరు ఊహించని విధంగా తీర్పునిచ్చారు.దీంతో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాని మోదీ హాజరు కాబోతున్నారు.

విజయవాడ కేసరపల్లి ఐటీ పార్కు వద్ద జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ఉదయం 8:20 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి ఉదయం 10:40 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.అక్కడి నుంచి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటారు.ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12:45 నిమిషాలకు విమానంలో భువనేశ్వర్ పర్యటనకు బయల్దేరి వెళ్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube