తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్.ప్రస్తుతం పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో పాన్ ఇండియాలో తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం లో ఉన్నాడు.
ఇక ఇప్పటికే పుష్ప సినిమాతో బాలీవుడ్ లో భారీ గుర్తింపు ను సంపాదించుకున్న ఆయన ఇప్పుడు మరోసారి ఈ సినిమాతో తన ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక సుకుమార్ ( Sukumar )దర్శకత్వం లో సినిమా వస్తుందంటే అందులో ఐటెం సాంగ్ పక్కాగా ఉంటుంది.
ఇక సుకుమార్ చేసిన ఆర్య సినిమా నుంచి పుష్ప సినిమా వరకు ప్రతి సినిమాలో ఒక ఐటెం సాంగ్ అయితే ఉంటూ వస్తుంది.కాబట్టి ఈ సినిమాలో కూడా మరొక ఐటెం సాంగ్ ని పెట్టాలనే ఉద్దేశ్యం లో సుకుమార్ ఉన్నాడు అయితే ఈ ఐటెం సాంగ్ కోసం పలువురు హీరోయిన్లను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి అందులో ఎవరితో ఐటెం సాంగ్ చేయిస్తారు అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు.ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్( Bollywood ) నుంచి ప్రత్యేకంగా ఒక ఐటెం గర్ల్ ను కూడా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనే విషయాలు తెలియదు గానీ మొత్తానికి అయితే పుష్ప 2 సినిమాతో సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో సినిమా మేకర్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందుకోసం ఈ సినిమా మీద మంచి హైప్ ను క్రియేట్ చేస్తూ వస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టిజర్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది.చూడాలి మరి సుకుమార్ తన అనుకున్నట్టుగానే పుష్ప సినిమాను మించి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనేది…
.