బీజేపీ తోనే వైసీపీ.. మరోసారి రుజువైందా ?

ఏపీలో బీజేపీ అధికారికంగా జనసేన( JanaSena Party ) పొత్తులో ఉందనే సంగతి అందరికీ తెలిసిందే.అయితే టీడీపీ, వైసీపీ పార్టీలు కూడా బీజేపీతో దోస్తీని కోరుకుంటున్నాయి.

 Ycp With Bjp.. Has It Proved Once Again, Ycp Party, Bjp Party, Janasena Party ,-TeluguStop.com

టీడీపీ విషయంలో బీజేపీ కొంత దూరంగానే ఉంటూ వచ్చినప్పటికి వైసీపీ విషయంలో మాత్రం కేంద్ర బీజేపీ కొంత సానుకూలంగా కొంత వ్యతిరేకంగా మెలుగుతూ వస్తోంది.క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం వైసీపీకి అండగా నిలుస్తూ రావడం, సకాలంలో నిధులు విడుదల చేయడం వంటి పరిణామాలతో బీజేపీ మరియు వైసీపీ మద్య అంతర్గత పొత్తు ఉందనే భావనా అందరిలోనూ కలిగింది.

Telugu Ap, Bjp, Cm Jagan, Janasena, Tdp, Vijay Sai Reddy, Ycp-Politics

అయితే ఇలాంటి వార్తలతో నష్టం చేరుకే అవకాశం ఉందని గ్రహించిన బీజేపీ( BJP party ) ఆగ్రనాయకత్వం ఆ వెంటనే వైసీపీ సర్కార్ పై జగన్ ( CM jagan )పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం ప్రారంభించింది.అటు జగన్ కూడా బీజేపీ తమతో లేదని క్లారిటీ ఇచ్చారు.ఇక ఆ తరువాత ఎన్డీయే మిత్రా పక్షాలతో నిర్వహించిన సమావేశానికి కూడా వైసీపీ అటెండ్ కాకపోవడంతో దాదాపు ఈ రెండు పార్టీల స్నేహబంధం చెడిందనే భావించారంతా.కానీ అబ్బే అలాంటిదేమీ లేదని.

వైసీపీ ఎప్పుడు బీజేపీ వెంటేనని మరోసారి రుజువైంది.తాజాగా లోక్ సభలో విపక్షాలన్నీ ఏకమై మణిపూర్ విషయంలో మోడి సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు.

Telugu Ap, Bjp, Cm Jagan, Janasena, Tdp, Vijay Sai Reddy, Ycp-Politics

ఈ తీర్మానానికి వైసీపీ దూరంగా ఉంటుందని.ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి( Vijay Sai Reddy ) ఇటీవల చెప్పుకొచ్చారు.మోడి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టవలసిన అవసరం లేదని.తాము మోడి సర్కార్ కు మద్దతుగా నిలుస్తామని ఆయన చెప్పుకొచ్చారు.దీంతో వైసీపీ మళ్ళీ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అందువల్ల బీజేపీతో స్నేహబంధాన్ని దూరం చేసుకునేందుకు వైసీపీ సిద్దంగా లేదని మరోసారి స్పష్టమైంది.మరి పొత్తు కానీ పొత్తుతో స్నేహబంధాన్ని కొనసాగిస్తున్న ఈ రెండు పార్టీల మద్య బంధం ఎంతవరుకు వెళుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube