ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.43
సూర్యాస్తమయం: సాయంత్రం.5.41
రాహుకాలం: మ.3.00 సా4.30
అమృత ఘడియలు: ఉ.6.00 ల8.30 సా4.40 ల 6.30
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00
మేషం:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
వృషభం:
ఈరోజు మీరు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మిథునం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.
దీనివల్ల మనశ్శాంతి గా ఉంటుంది.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఖర్చులు ఎక్కువగా చేస్తారు.సమయాన్ని కాపాడుకోవటం మంచిది.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించడం మంచిది.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
సింహం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం మరింత ప్రయత్నించాలి.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
కన్య:
ఈరోజు మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.తరచు మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి
తుల:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేయకూడదు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉండదు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:
ఈరోజు మా చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.మీ కుటుంబ సభ్యులతో కలసి ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
ధనుస్సు:
ఈరోజు మీరు అప్పులు చేసి వాటిని తిరిగి ఇచ్చేటప్పుడు సమస్యలు ఎదుర్కొంటారు.ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.ఈరోజు మీకు మీరు చేసే పనులకు అనుకూలంగా ఉంది.
కొన్ని నిజాలు తెలుస్తాయి.మీరు బాగా దగ్గరి వారితో ఫోన్ లో కాలక్షేపం చేస్తారు.
మకరం:
ఈరోజు మీరు కొన్ని అవసరాలకు డబ్బు ఖర్చు పెడతారు.మీ ఫలితాల కోసం మీరు ఏకాగ్రతతో పని చేయాలి.మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబంతో గొడవలు జరిగే అవకాశం ఉంది.దీంతో ఇంట్లోనే సమయాన్ని గడుపుతారు.చాలా సంతోషంగా ఉంటారు.
కుంభం:
ఈరోజు మీరు చేసే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఖర్చు పెట్టండి.మీరు మీ కుటుంబం పట్ల తీసుకున్న జాగ్రత్త వాళ్లని సంతోష పెడుతుంది.అనుకోని చోటు నుండి సర్ ప్రైజ్ వస్తుంది.ఈరోజు మీ పిల్లలతో సమయం గడుపుతారు.వైవాహిక జీవితం సంబంధించిన ఈ విషయంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి.
మీనం:
ఈరోజు మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఎక్కువగా ఉండాలి.దీని వల్ల మీకు విశ్రాంతి అవసరం.భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టినందుకు ఈరోజు ఫలితాలు అందుతాయి.
కుటుంబ సభ్యులకు వారి అవసరాలు తీర్చండి.ఈరోజు మీ స్నేహితులతో సమయం కేటాయిస్తారు.