మన దేశ వ్యాప్తంగా దాదాపు చాలామంది ప్రజలు ప్రతిరోజు ఏదో ఒక భగవంతునికి పూజలు చేస్తూనే ఉంటారు.అలా పూజ చేసిన తర్వాత దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాతే మిగతా ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు.
అయితే కొందరి ఇళ్ళలోని పూజ గదిలో దేవుని ఫోటోలు, విగ్రహాలు రెండు ఉంటాయి.భగవంతుని పూజించే ముందు ఈ రెండిటికి మధ్య తేడా తెలుసుకోవాలని వేద పండితులు చెబుతున్నారు.
ఫోటోలకు, విగ్రహానికి పూజ చేసే విధానంలో కొన్ని వేరే నియమాలు పద్ధతులు రెండు కూడా వేరుగా ఉంటాయని చెబుతున్నారు.అయితే చిత్రపటానికి, విగ్రహానికి పూజ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
లేదంటే పుణ్యం విషయం ఏమో కానీ పాపం తగిలే అవకాశం ఉంది.విగ్రహాదరణ ను సిద్ధ ఆదరణ అని కూడా అంటారు.అయితే ఫోటో ఆరాధన అనేది మనసా ఆరాధన రూపంలో ఉంటుంది.సిద్ధ పూజ అంటే పూర్తి పద్ధతితో చేసే ఆరాధన అని అర్థం.
మానస పూజా అంటే మనసుతో చేసే మానసిక ఆదరణ అని చాలామంది చెబుతారు.విగ్రహారాధనలో ఒక ఆసనంపై కూర్చోవడం తప్పనిసరిగా చేయాలి.
అయితే చిత్రపటానికి పూజ చేసేటప్పుడు కచ్చితంగా కూర్చోవాలని ఎటువంటి నియమం లేదు.
విగ్రహారాధనలో అభిషేకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.అయితే ఫోటో పూజలో జలాభిషేనానికి స్థానం లేదు.విగ్రహధారణలో సాధన చేయడం ద్వారా మన కోరికను భగవంతునికి తెలుపవచ్చు అయితే చిత్ర పూజలో పూజ చేయడం సాధ్యం కాదు విగ్రహ దారంలో దేవుడిని ప్రతిష్టించిన తర్వాత మాత్రమే పూజించాలి అయితే చిత్ర పూజలో అలాంటి నిబంధనలేమి లేవు.
విగ్రహారాధనలో విగ్రహం పరిమాణం మూడు అంగుళాల కంటే ఎక్కువ ఉండడం మంచిది కాదు.నిజానికి విగ్రహమైన, చిత్రమైన స్నానం చేసిన తర్వాతే పూజ చేయడం మంచిది.
DEVOTIONAL