ప్రస్తుత సమాజంలో జీవితంలో సౌకర్యంగా, సుఖ, సంతోషాలతో జీవించడానికి ధనం ఎంతో అవసరం.అందుకోసం ఆ ఇంటి పై లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా ఉండాలి.
తెలిసి తెలియక చేసే తప్పులు తప్పకుండా కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొనేలా చేస్తాయి.వాస్తు చెప్పిన దాన్ని బట్టి కొన్ని రకాల తప్పులు లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు.
అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడాలంటే ముందు మనకు అవేంటో తెలిసి ఉండడం ఎంతో అవసరం.ఆ తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రంలో లక్ష్మి దేవికి( Lakshmi devi ) ఆగ్రహం తెప్పించే కొన్ని తప్పులు గురించి కూడా ప్రస్తావించారు.అలాంటి ఇళ్ళలో లక్ష్మీదేవి అస్సలు ఉండదు.అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక చికాకు వెంటాడుతూనే ఉంటుంది.జీవితం సుఖమయంగా ఉండాలంటే ఈ తప్పులను అస్సలు చేయకూడదు.బద్దకంగా ఉండే ఇంటిలో, సమయం వృధాగా గడిపే మనుషులు ఉండే ఇంట్లో లక్ష్మి దేవి అసలు నిలిచి ఉండదు.ముఖ్యంగా చెప్పాలంటే వారసత్వంగా కోట్లాది ఆస్తి సంక్రమించిన సరే ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే ఆ ఆస్తి అంతా అతి త్వరలో కర్పూరం లాగా కరిగిపోతుంది.

ఆర్థిక సంక్షోభాలు( Financial crises ) తీరే మార్గమే ఉండదని శాస్త్రం చెబుతోంది.శుభ్రమైన ప్రదేశాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం.శుభ్రమైన ప్రదేశాలను వదిలి అస్సలు వెళ్ళదు.ముఖ్యంగా చెప్పాలంటే పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం అసలు ఉండదు.కాబట్టి పరిసరాల పరిశుభ్రత( Environmental ), వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరం.ఏ ఇంట్లో అయితే పసిపిల్లలు, స్త్రీలు, వృద్ధులు సముచిత స్థానాల్లో ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది.
ఇంకా చెప్పాలంటే స్త్రీల పట్ల అనుచిత ప్రవర్తన కలిగిన కుటుంబాలు తప్పక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటారు.అలాగే వృద్ధులకు సరైన గౌరవం దొరకని ఇంట్లోనూ లక్ష్మీదేవి ఉండదని పండితులు చెబుతున్నారు.
ఇతరుల పై ఈర్ష్య పడుతున్న వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి అస్సలు ఉండదు.
DEVOTIONAL







