ఆషాడ మాసంలో అత్త, కోడళ్ళు ముఖాలు ఎందుకు చూసుకోకూడదో తెలుసా..?

ఆషాడమాసం( Ashadamasam ) ప్రారంభమైంది.దీంతో కొత్తగా పెళ్లయిన వారు అత్తింటిని వదిలి పుట్టింటికి వెళ్ళిపోతారు.

 Do You Know Why Aunts And Daughters-in-law Should Not Look After Each Other In T-TeluguStop.com

అయితే ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లి అయిన పెళ్లి కూతురు పుట్టింటికి రావడం అనేది చాలా కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది.ఎందుకంటే ఈ మాసంలో అత్త ముఖం కోడలు చూడకూడదు అని అంటారు.

అయితే అసలు ఆషాఢ మాసంలో కొత్త కోడలు అత్తింటి కాకుండా పుట్టింట్లో ఎందుకు ఉండాలి.అత్త ముఖం ఎందుకు చూడకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే ఈ ఆషాడం మాసంలో కొత్తగా పెళ్లయిన మహిళలు పుట్టింటికి రావడం, అత్త ముఖం చూడకూడదు అన్న దానిపై చాలా కథనాలు ఉన్నాయి.

ఆషాడమాసం వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యే సమయం.అందుకే కొత్తగా పెళ్లైన పురుషుడు భార్య పక్కనే ఉంటే ఇతర పనులపై శ్రద్ధ పెట్టలేడు.అందుకే వైవాహిక జీవితం( married life ) నుంచి అతని ధ్యాస మళ్లించేందుకు భార్యను పుట్టింటికి పంపించేవారు.

అందుకే కోడలు, అత్త ముఖం చూడకూడదు అన్న ఒక నియమాన్ని పెట్టారు.ఇక మరో కథనం ప్రకారం బయట కొత్తగా పెళ్ళైన వారికి అట్టింట్లో కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

దీంతో వారిని బయట ప్రపంచంలోకి తీసుకురావడానికి ఆషాడమాసం పేరుతో అత్తింటికి దూరం చేస్తారు.

అంతేకాకుండా ఇలా దంపతులు( couple ) దూరంగా ఉండటం వలన వారి దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుందని పెద్దలు నమ్ముతారు.అలాగే ఈ మాసంలో భార్యాభర్తల కలయిక వలన గర్భం దాల్చడం మంచిది కాదని, ఒకవేళ గర్భం దాల్చితే మండు వేసవిలో ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది.దీంతో తల్లి బిడ్డకు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి అన్న అవకాశం ఉన్నందువలన ఆషాడమాసం పేరుతో భార్యాభర్తలను వేరు వేరుగా ఉంచుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube