బుల్లి తెరపై వెండితెర పై ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందుకుంటూ కెరియర్ లో దూసుకుపోతున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె రంగమ్మత్త పాత్ర ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా ఈ సినిమా ద్వారా వరుస సినిమా అవకాశాలను అందుకున్న అనసూయ ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకు పోతున్నారు.
కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఈ క్రమంలోనే ఈమె వైట్ శారీలో ఏంజెల్ లా మెరిసిపోతూ ఉన్న ఫోటోని షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఈ ఫోటో పై ఒక జర్నలిస్ట్ తన గురించి రాస్తూ 40 సంవత్సరాలలో కూడా అనసూయ క్రేజ్ అందం ఏ మాత్రం తగ్గలేదని రాసుకొచ్చారు.
ఇక విషయంపై అనసూయ స్పందించారు.
ఈ క్రమంలోనే సదరు వెబ్ సైట్ గురించి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… హలో సాత్విక(ఈ ఆర్టికల్ జర్నలిస్ట్) నాకు 40+కాదు ఇంకా 36.ఇలా నా వయసు అనివార్యం కాదు నేను ఎప్పుడూ ఆ విషయంలో ఎలాంటి సిగ్గుపడను.నేను ఎప్పుడు అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తాను కానీ మీ జర్నలిస్టులు మీ వృత్తినీ ఎంతో న్యాయంగా, నిజాయితీగా పరిగణించండి.
మీరు అందించిన కొన్ని మంచి విషయాలకు ధన్యవాదాలు.
మీరు మీ వివరణలో మంచి పదాలు ఉపయోగించడం వల్ల మీరు ఎంతో గౌరవించ బడతారు.మీ జర్నలిజం అనే వృత్తి ఒక ఆయుధం వంటిది అంటూ ఈ సందర్భంగా ఈమె జర్నలిస్టుకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు.ఈ విధంగా అనసూయ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.