తెలంగాణా సీఎం కేసీఆర్ కుమార్తె.నిజామాబాద్ ఎంపీ కవిత వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడం లేదా.? మరి కవిత ఏమి చేయనున్నారు.కవిత ఎంపీ సీటు ఎవరికి ఇవ్వనున్నారు అంటే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయితే దిల్ రాజుకి ఈసారి ఎంపీ టికెట్ ఇవ్వనున్నారు అని తెలుస్తోంది.
అందుకే తగ్గట్టుగానే ఈమధ్య దిల్ రాజ్ కేసీఆర్ తో మంతనాలు జరుపుతున్నారట.అయినా కవితని కాదని దిల్ రాజు కి ఈ టికెట్ ఎలా ఇస్తారు అని అనుకుంటున్నారా ఇక్కడ అసలు విషయం ఏమిటి అంటే…
కేసీఆర్ తనయ ఎంపీ కవిత.
ఇప్పుడు రాష్ట్రరాజకీయల్లోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారు అని తెలుస్తోంది.ఈ విషయంలో ఆమె ఫుల్ క్లారిటీ గా ఉన్నారట.రాష్ట్ర రాజకీయాలు అయితేనే ఆమె ప్రజలలో మరింతగా దూసుకుపోవచ్చు.తన అన్నకి తోడుగా ఉండవచ్చు అని అని ఆమె అభిప్రాయం అని అంటున్నారు.
అయితే ఆమె తెలంగాణలో జగిత్యాల నియోజకవర్గంపై కన్నేసి అక్కడ అభివృద్ధి పై ప్రత్యేకమైన శ్రద్ద కనబరుస్తున్నారు.చేస్తున్నారు.ఆ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మునిసిపాలిటీలకు ఆమె ఇటీవల ఏకంగా రూ.100 కోట్ల నిధులను తమ సోదరుడు కేటీఆర్ మంత్రిగా ఉన్న పురపాలక శాఖ నుంచి విడేదల చేయించారు.
అంతేనా ఏకంగా జగిత్యాలలో ఓ ఇల్లు తీసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు.జగిత్యాలలో ఏ పని కావాలన్న వెంటనే నిధులు మంజూరు చేయించి ఆ పనులు పూర్తి చేయిస్తున్నారు.
కవితకు ఒక్కసారి అయినా మంత్రి పదవి చేపట్టాలన్న కోరిక బలంగా ఉందన్నది పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి…మరి కవిత జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆమె ఎంపీగా ఉన్న నిజామాబాద్ ఎంపీగా ప్రముఖ సినిమా నిర్మాత దిల్ రాజును టీఆర్ఎస్ పోటీకి పెడుతుందని కొంతకాలం కిందట వార్త వచ్చింది.నిజామాబాద్ జిల్లాకు చెందిన దిల్ రాజు రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించాలని భావిస్తున్నారు.
ఈ లెక్కలో దిల్ రాజు విజయం సాధిస్తార అంటే పోటీ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు అని చెప్పచ్చు.ఎందుకంటే దిల్ రాజు తన నియోజక వర్గ పరిదిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.
అంతేకాదు సినిమా వ్యక్తిగా కూడా ఎంతో ఆదరణ అక్కడి ప్రజలలో ఉంది మరి.కేసీఆర్ తన కుమార్తె సీటు దిల్ రాజుకి ఇస్తాడా.లేకపోతె కవిత మళ్ళీ మనసు మార్చుకుని ఏమ్పీగానే ఉంటుందా అనేది త్వరలో తేలిపోనుంది అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు.