వైఎస్ జగన్ పై తమిళ హీరో షాకింగ్ కామెంట్స్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.తన తండ్రి చనిపోయినప్పుడు సీఎం అయ్యే అవకాశం వచ్చినా కూడా కాదనుకుని.

 Tamil Hero Surya Shocking Comments On Ys Jagan-TeluguStop.com

వైఎస్ చనిపోయినపుడు చనిపోయిన అనేకమంది వైఎస్ అభిమానులని ఓదార్చడానికి తీసుకున్న నిర్ణయం అప్పట్లో పెను సంచలనం అయ్యింది.ఆ తరువాత సోనియా గాంధీ అరెస్టులు చేయించడం.

కేసులు బనాయించడం.ప్రతిపక్షాలు విమర్శలు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక కేసులు వేసి జైలుకు పంపినా ఏ మాత్రం బెదరకుండా ధైర్యం ఉన్న ఒకే ఒక వ్యక్తి.

వైఎస్ జగన్.ఇప్పుడు ప్రజలకోసం ప్రజా ప్రయోజనాలకోసం చేపడుతున్న పాదయాత్ర కి అనూహ్యమైన స్పందన రావడం.

జగన్ కి కలిసొచ్చిన అంశాలుగా చెప్పచ్చు అయితే ఇప్పుడు తమిళ హీరో సూర్య జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు.

తమిళ్ లో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుని మాస్ ప్రేక్షకులకి ఎంతో చేరువ అయిన సూర్య తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది.

ఇప్పుడు ఈ హీరో వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర సక్సెస్ కావాలని కోరుకుంటున్నాడు.అంతేకాదు తన తండ్రి వైఎస్ఆర్ లా రాజకీయాల్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాడు.తమిళ్ లో తీసిన గ్యాంగ్ సినిమాతెలుగులో సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకి ఎదో మంచి చేయాలనే తపన జగన్ అన్న లో ఉందని అన్నారు.అందుకే పాదయాత్ర చేపట్టారు అన్నారు… వైఎస్‌జగన్‌కు కష్టపడేతత్వం ఎక్కువ.పైగా ప్రజలకు మేలు జరుగుతుందంటే ఎంత దూరమైన వెళ్తారు అని సూర్య పేర్కొన్నారు…తనకి కాలీజీ రోజుల నుంచీ వైఎస్ ఫ్యామితో మంచి రిలేషన్ ఉందని.ఆయన గురించి నాకు బాగా తెలుసునని అన్నారు సూర్య.

ఇదిలా ఉంటే సూర్య కామెంట్స్ హాస్యాస్పదంగా ఉన్నాయని.ఆయన ఇలాంటి వీడియోలు మాట్లాడటానికి సూర్యా స్థాయి ఎందుకు దిగాజార్జుకోవడం అని అంటున్నారు టిడిపి నాయకులు.

మొత్తానికి జగన్ కి తమిళ హీరో సూర్యా మద్దతు అయితే దొరికేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube