ప్రస్తుతం మన దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు కార్తీక మాసాన్ని ఎంతో ఘనంగా, ఉత్సాహంగా తమ కుటుంబ సభ్యులందరితోపాటు చేసుకుంటున్నారు.దాదాపు కార్తీకమాసం చివరి దశలో ఉంది.
కార్తిక బహుళ ఏకాదశి, ద్వాదశి తిధులతో తులసి వివాహం చేయడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయి అని చాలా మంది నమ్ముతారు.ప్రతి ఏడాది ద్వాదశి, తిధినాడు తులసిని శ్రీమహావిష్ణువు శాలిగ్రామంతో వివాహం చేసుకుంటాడని పురాణాలలో ఉంది.
తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా చాలామంది ప్రజలు భావిస్తారు.తులసి మొక్కను ఎప్పుడూ పూజించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరే అవకాశం ఉంది.
తులసి మొక్కను కార్తీక మాసంలో పూజిస్తే ఎన్నో పుణ్యఫలాలను పొందవచ్చు.తులసి వివాహం చేయాలని అనుకుంటే సాయంత్రం పూట పూజను మొదలు పెట్టడం మంచిది.తులసి చెట్టు ఎదురుగా నీటితో నింపిన పాత్ర ఉంచి నెయ్యితో దీపాన్ని వెలిగించడం మంచిది.తులసి మొక్కకు చందనం, తిలకం రాయాలి.
తులసి మొక్కకు ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించడం మంచిది.

ఆ తర్వాత తులసి మొక్కకు ప్రదక్షిణలు చేసి హారతి ఇవ్వాలి.తులసి వివాహం సందర్భంగా తప్పకుండా ఉపవాసం ఉండడం మంచిది.దీనివల్ల ఆ ఇంటిలోని ఆరోగ్య సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంది.
తులసి మొక్క ప్రదక్షిణలు చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని భక్తులు భావిస్తారు.ఇంకా చెప్పాలంటే తులసి పూజ వల్ల వాస్తు దోషాలు తొలగిపోయే అవకాశం ఉంది.
తులసి మొక్క వివాహంతో విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంటిపై ఎప్పుడూ ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఆ ఇంట్లో నీ కుటుంబ సభ్యుల కష్టాలన్నీ తీరిపోయి వారందరూ సుఖసంతోషాలతో ఉంటారు.