2024 సంవత్సరం మెగా నామ సంవత్సరం.. నిహారిక కామెంట్స్ ప్రేక్షకుల్లో సంతోషం నింపాయిగా!
TeluguStop.com
మెగా డాటర్ నిహారికకు( Mega Daughter Niharika ) ప్రేక్షకులలో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మరికొన్ని రోజుల్లో కమిటీ కుర్రాళ్లు సినిమాతో నిహారిక ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిహారిక మాట్లాడుతూ 2024 సంవత్సరం మెగా నామ సంవత్సరం ( Mega Family Year
)అనే అర్థం వచ్చేలా చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
నిహారిక మాట్లాడుతూ మా అన్నయ్య వరుణ్ తేజ్ ( Varun Tej )నాకెప్పుడూ సపోర్ట్ చేస్తూ నా వెంటే ఉంటాడని తెలిపారు.
ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునే మా బావ ఈ వేదికపై ఉండడం చాలా ఆనందంగా ఉందని నిహారిక చెప్పుకొచ్చారు.
ఈ సినిమా తర్వాత కనిటీ కుర్రోళ్లు డైరెక్టర్ వంశీ( Director Vamsi ) పేరు ఇండస్ట్రీలో వినిపిస్తుందని నిహారిక కామెంట్లు చేశారు.
ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటీనటులను పెట్టాలని అనుకున్నానని నిహారిక తెలిపారు. """/" /
ఆ సమయంలో వంశీ మాత్రం కొత్తవారితో చేద్దామని అన్నారని నిహారిక వెల్లడించారు.
ప్రస్తుతం 15 మంది టాలెంట్ ఉన్న యాక్టర్లను ఇండస్ట్రీకి తెచ్చామనే సంతృప్తి నాకు ఉందని నిహారిక చెప్పుకొచ్చారు.
కమిటీ కుర్రాళ్లు సినిమాకు( Committee Kurrallu ) సాయికుమార్ ప్రత్యేక ఆకర్షణ అని ఆమె కామెంట్లు చేశారు.
ఆగష్టు 9వ తేదీన కమిటీ కుర్రోళ్లు ప్రేక్షకుల ముందుకు రానుందని నిహారిక అభిప్రాయపడ్డారు.
"""/" /
ఈ సంవత్సరం మా కుటుంబానికి అద్భుతంగా ఉందని ఆమె తెలిపారు.
మా చరణ్ అన్న సినిమా ఆస్కార్స్ కు వెళ్లిందని నిహారిక పేర్కొన్నారు.మా పెదనాన్నకు పద్మ విభూషణ్ వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.
మా బాబాయ్ డిప్యూటీ సీఎం అయ్యారని నిహారిక కామెంట్లు చేశారు.నేను కూడా నా ఫస్ట్ మూవీతో వస్తున్నానని నిహారిక తెలిపారు.
నిహారిక చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
ప్రేక్షకులను గొర్రెలనుకున్నారా.. ఆ సినిమా తీయడమే ఎన్టీఆర్ చేసిన పెద్ద బ్లండర్?