తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కటింగ్ షాపులకు, ఇస్త్రీ, లాండ్రీ షాపులకు దాదాపు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు ప్రకటన చేశారు.ఇటీవల రజక మరియు నాయీ బ్రాహ్మణ సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
దీనికి సంబంధించిన ప్రభుత్వ ఆదేశాలను వెంటనే జారీ చేయాల్సిందిగా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎంఓ కార్యదర్శి భూపాల్ రెడ్డికి చెప్పడంతో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం..
ఆదేశాలు జారీ చేశారు.

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బలహీన వర్గాలను పైకి తీసుకు రావడం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను చేస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.ఈ నిర్ణయం ద్వారా గ్రామాలలో అదేవిధంగా జిహెచ్ఎంసి దాకా ఉన్న రెడీ కటింగ్ షాప్ కు మరియు లాండ్రీ షాపులకు నాణ్యమైన 250 ఏళ్ల విద్యుత్ ప్రభుత్వం అందిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.
టెక్నాలజీ పరంగా రజక, నాయి బ్రాహ్మణ వృత్తుల్లో అనేక యంత్రాలు .పనిలో భాగం కావటంతో ఈ నిర్ణయం వారికి ఎంతగానో లబ్ధి చేకూరుస్తుందని స్పష్టం చేశారు.