ఆపిల్ పండును పొట్టుతో తినడం మంచిదా.. లేదా..

Is It Better To Eat Apple Fruit With Peel Or , Eat Apple Fruit With Peel ,apple, Eat Apple ,apple Benefits

ప్రతిరోజు ఒక ఆపిల్ పండు తింటే వైద్యుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదని చాలామంది ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు.ఒక్క యాపిల్ లోనే మన శరీరానికి మంచి చేసే అనేక విటమిన్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

 Is It Better To Eat Apple Fruit With Peel Or , Eat Apple Fruit With Peel ,appl-TeluguStop.com

అందుకే వైద్యులు ప్రతి రోజు ఒక ఆపిల్ ని తినమని చెబుతూ ఉంటారు.ఆపిల్ పండ్లను తినని వారి కన్నా తినే వారిలో రోగాలను ఎదుర్కొనే శక్తి ఎక్కువగా ఉంటుంది.

అయితే ఆపిల్ తినే విధానంలో కొంత తేడా ఉన్నట్లు వారు చెబుతున్నారు.తినే సమయంలో తేడా ఎంట అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదు కొంతమంది యాపిల్ పండ్ల పైన పొట్టు తీసేసి తింటూ ఉంటారు.

దీనివల్ల శరీరానికి అందాల్సిన పోషకాలను నష్టపోతు ఉంటారని పనులు చెబుతున్నారు.అసలు ఆపిల్ లో ఉండే ఔషధాలు ఏంటి దాన్ని ఎలా తినాలి.ఎలా తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.ఆపిల్ పండు తినే సమయంలో చాలామంది ఒక చాకు తీసుకొని దానిపైన ఉన్న పొట్టును తీసివేసి లోపల గుజ్జును మాత్రమే తింటూ ఉంటారు.

అయితే ఆపిల్ లోని గుజ్జులో కన్నా దానిపై ఉండే పోట్టులోనే నాలుగు నుంచి ఆరు రెట్ల ఎక్కువ పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.ఈ పొట్టును తీసేసి తినడం వల్ల ఆ పోషకాలను కోల్పోతున్నట్లు చెబుతున్నారు.ఇది ఫైబర్ గుణాలను ఎక్కువగా కలిగి ఉంటుంది.

యాపిల్ పై పొట్టు శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.అంతేకాకుండా పొటాషియం, విటమిన్ కూడా పోట్టులోనే అధిక మొత్తంలో ఉంటాయి.లోపలి గుజ్జుతో పోల్చుకుంటే పోట్టులో రెండు నుంచి నాలుగు రెట్లు అధిక పోషకాలు ఉంటాయి.

ఆపిల్ పండు అనేక రకాల విటమిన్ లకు సమ్మేళనం అని చెబుతుంటారు.పొట్టుతో పాటు తింటేనే అవి శరీరానికి పుష్కలంగా అందుతాయి అని చెబుతుంటారు.

Video : ఆపిల్ పండును పొట్టుతో తినడం మంచిదా లేదా - Tips #TeluguStopVideo

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube