రైస్ మిల్లుల ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించిన అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్
TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యం లారీలు ఎప్పటికప్పుడు దించుకోవాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.


వేములవాడ మండలం మర్రిపల్లి లోని మారుతి, మణికంఠ, మహాలక్ష్మి రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశిలించినారు.


ఈ సందర్భంగా మిల్లుల యజమానులతో మాట్లాడారు.రైతులకు ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు.
ఎస్.విభాగాల ఆద్వర్యంలో ఇప్పటికే 248 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఐ.ఆద్వర్యంలో ఐదు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు.
వరి, పత్తి పండించిన రైతులు తమ పరిధిలోని కేంద్రాలకు పంట ఉత్పత్తులను తరలించాలని సూచించారు.
సరైన తేమ శాతంతో ధాన్యం, పత్తి తరలించి, మద్దతు ధర పొందాలని కోరారు.
మిల్లర్లు సహకరించి, ధాన్యం దించుకోవాలని పేర్కొన్నారు.
మెరిసే మృదువైన చర్మం కోసం ఈ ఓట్స్ ప్యాక్స్ ట్రై చేయండి!