ఏపీలో వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రజల్లో దూసుకుపోతోంది అందుకు నిదర్సనం రోజు రోజు కి పెరిగిపోతున్న జనాభిమానం ఇది ఎవరో చెప్తున్న మాట కాదు సాక్షాత్తు టీడీపీ అధినేత చేయించిన కీలక సర్వే రిపోర్ట్ ఫలితమట నిజానికి రానున్న ఎన్నికలు ఏపీలో రాజకీయ పార్టీలకి చావో రేవో అనే విధంగా ఉన్నాయి.ఏపీలోనే అత్యంత కీలకం కానున్నాయి.
అయితే రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ.ప్రధానంగా పోటీ మాత్రం టీడీపీ వైసీపీ లమధ్యనే ఉంటుంది అంతడంలో సందేహం లేదు.

అందుకే ప్రజలని తమవైపు ఆకర్షించుకోవడానికి ఇరు పార్టీలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.తెరవెనుక వ్యూహాలు వేగంగా మార్చుతున్నాయి.ఇదిలాఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు ఇద్దరిపై ఈ మధ్యకాలంలో వస్తున్న విమర్సలని తమకి అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ వ్యుహాలని ఇప్పటికే సిద్డం చేసిందనే చెప్పాలి.ఒక వైపు పాదయాత్రకి వస్తున్న ప్రజాదరణ మరో వైపు జగన్ మైలేజ్ పెరుగుతుందేమోనని భయపడిన అధిష్టానం వచ్చే…

ఎన్నికల సమయంలో జగన్ హవా ఎలా ఉండబోతోంది.జగన్ వ్యవహార శైలి వలన వచ్చే ఎన్నికల్లో ఎంతవరకూ రాజకీయంగా మైనస్ అవుతుంది.ఇలా మరి కొన్ని అంశాలపై ఇటీవల సర్వే చేయించారట టీడీపీ అధినేత అయితే ఈ సర్వే లో అధినేతకి సొంత సర్వే దిమ్మతిగ్గిపోయే రిజల్స్ ముందు ఉంచిందట అదేంటంటే.
రాను రాను జగన్ కి పాదయాత్ర మూలంగా విపరీతమైన ప్రజాదరణ పెరిగిపోతోందట.ఎన్నో టీవీ సోషల్ మీడియా మాధ్యమాలు ఉన్నా సరే జగన్ కి ఇంతగా విపరీతమైన ఆదరణ పెరిగిపోవడంతో ఖంగుతిన్నారట.
ఇదిలాఉంటే మరోపక్క, నిత్యం జగన్ పాదయాత్రపై విమర్శలు చేస్తూ వస్తున్న కొంతమంది మంత్రులు సైతం ఈ సర్వేతో ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చిందని అంటున్నారు.టీడీపీలోకి కొత్తగా వచ్చే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గటం…సినీ ప్రముఖులు సైతం జగన్ కి మద్దతు తెలుపుతూ ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోవడంతో టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలయ్యిందట…అంతేకాదు ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకులు సైతం జగన్ చెంతకు చేరి పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఇప్పుడు ఏమి చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది ఈ సమయంలోనే ఈ సర్వే రిపోర్ట్ కూడా రావడంతో నేతల్లో ఓటమి గుబులు పుట్టుకొస్తోంది అంటున్నారు.
మరి బాబు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారో నేతల్లో ఎలా ధైర్యాన్ని నింపుతారో వేచి చూడాల్సిందే.