హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి తర్వాత హనీమూన్ క్రిస్మస్ న్యూ ఇయర్ వెకేషన్ అంటూ తమ జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.ఇలా పెళ్లి తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చినటువంటి వీరిద్దరు కూడా తిరిగి తమ సినిమా పనులలో బిజీ అయ్యారు.
ప్రస్తుతం వరుణ్ తేజ్ మట్కా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు ఇక లావణ్య త్రిపాఠి కూడా ఒక తమిళ సినిమాతో పాటు మరొక వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్నారు త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

లావణ్య త్రిపాఠి, అభిజీత్, అభిజ్ఞ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మిస్ పర్ఫెక్ట్(Miss Perfect) అనే సిరీస్ త్వరలో రానుంది.ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్‌స్టార్(Disney Plus Hotstar) లో ఈ మిస్ పర్ఫెక్ట్ సిరీస్ త్వరలోనే విడుదల కాబోతుందని తెలుస్తుంది.అయితే విడుదల తేదీ ఇప్పటివరకు ఇంకా ప్రకటించలేదు.
కానీ త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది.ఇక పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటించినటువంటి మొదటి వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెప్పాలి.

ఇక ఈమె ఇదివరకు సినిమాలలో హీరోయిన్ గా నటించడమేకాకుండా పులిమేక అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సిరీస్ ప్రేక్షకులను మంచిగా ఆకట్టుకుంది.మరి పెళ్లి తర్వాత మొదటి వెబ్ సిరీస్ విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్( Web Series ) ద్వారా లావణ్య త్రిపాఠి ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనే విషయం తెలియాల్సిందే అయితే పెళ్లి తర్వాత ఎలాంటి కొత్త సినిమాలకు కానీ లేదా వెబ్ సిరీస్ లకు కానీ కమిట్ అవ్వలేదు.మరి పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారా లేకపోతే కొంత గ్యాప్ ఇచ్చి తిరిగి ఇండస్ట్రీలో బిజీ కానున్నారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.







