సాధారణంగా శివుని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు.ఈ అభిషేకాలలో భాగంగానే శివునికి భస్మంతో కూడా అభిషేకం నిర్వహిస్తుంటారు.
అదేవిధంగా శివుని పూజించే భక్తులు తమ నుదిటిపై, చేతులు, ఉదరం భాగాలలో విభూతిని ధరించడం మనం చూస్తూనే ఉంటాం.అయితే ఈ విభూదిని ధరించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? భస్మం ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
ఒకరోజు శివుడు కైలాసం నుంచి రాముడిని కలవడానికివిప్రవేషంలో వెళ్తాడు.అతనిని చూసిన రాముడు నీ పేరేమిటి? నువ్వు ఎక్కడ నివసిస్తావు? అని అడగగా అందుకు శివుడు.నాపేరు శంభుడు.
నా నివాసం కైలాసం అని చెప్పడంతో విప్రవేషంలో ఉన్నది శివుడే నేనని భావించిన రాముడు విభూతి (భస్మం) ప్రాముఖ్యతను వివరించవలసినదిగా తెలియజేస్తాడు.

దీంతో శివుడు భస్మం ప్రాముఖ్యతను తెలియజేస్తూ.బ్రహ్మ దేవుడు మన నుదుటి పై రాసిన రాతను కూడా తుడిచివేసే అంత శక్తి ఈ విభూతికి ఉందని తెలియజేస్తాడు.ఈ విబూదిని మూడు రేఖలుగా మన నుదిటిపై ధరించినప్పుడు ఆ త్రిమూర్తులు ముగ్గురు మన నుదిటి పై దర్శించినట్లు అవుతుందని తెలిపాడు.
మన ముఖం మీద ఈ భస్మాన్ని ధరిస్తే నోటి ద్వారా చేసిన పాపాలు తొలగిపోతాయి.అదేవిధంగా చేతులు పై రాసుకోవడం ద్వారా చేతుల ద్వారా చేసిన పాపాలు తొలగిపోతాయి.
హృదయం పై విభూదిని ధరిస్తే దురాలోచనలు, నాభిపై ధరిస్తే వ్యభిచార దోషాలు, ప్రక్కలలో ధరిస్తే పర స్త్రీ, సర్పదోషాలు తొలగిపోతాయి.మనం చేసేటటువంటి సర్వపాపాలను సైతం ఈ విభూతి తొలగిస్తుంది కాబట్టి దీనిని భస్మం అని పిలుస్తారు.
ఈ భస్మంపై పడుకున్న, తిన్న మనం చేసిన పాపాలు భస్మం అవుతాయని ఆ పరమ శివుడు శ్రీరామునికి తెలియజేశాడు.సర్ప, తేలు విషాన్ని కూడా ఈ విభూతి సంహరిస్తుంది.
అంత మహిమ ఉంది కాబట్టి ఎల్లవేళల శివుని భక్తులు ఈ విభూతిని ధరిస్తారని శివుడి తెలియజేశాడు.