Sreekanth: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణ వంశీ( Krishna Vamsi ) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ చిత్రాలలో ఖడ్గం( Khadgam ) ఒకటి.శ్రీకాంత్,( Sreekanth ) రవితేజ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా లవ్, కామెడీ, దేశం ఎమోషన్ వంటి మల్టీ జానర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా 2002వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా అదే స్థాయిలో ఆదరణ పొందుతుంది.

ఇప్పటికీ కూడా ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే వస్తే ఈ సినిమాకి తప్పకుండా ప్రసారం చేస్తారు.ఇలాంటి ఓ అద్భుతమైన సినిమాని 22 సంవత్సరాల తర్వాత తిరిగి విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు.ఈ సినిమా అక్టోబర్ 18 వ తేదీ తిరిగి విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ కృష్ణ వంశీ, శ్రీకాంత్,శివాజీ రాజా, షపీ పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కృష్ణ వంశీ మాట్లాడుతూ భారతీయ జెండా ఒక ఖడ్గం లాంటిదన్న ఉద్దేశంతో సినిమాకు ఆ టైటిల్ పెట్టామని తెలిపారు.ఇక హీరో శ్రీకాంత్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.జనరేషన్స్ మారినా పెట్రియేటిక్ సినిమాలలో ఖడ్గం గొప్ప .అసలు ఖడ్గంలో నిర్మాత మధు మురళి( Producer Madhu Murali ) నన్ను వద్దు అన్నారు.అయినా కృష్ణవంశీ దైర్యం చేసి నన్ను ఈ సినిమాలో తీసుకున్నారు.
నా లైఫ్ లో ఈ సినిమను మర్చిపోలేను.ఈ మూవీ మళ్లీ విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ శ్రీకాంత్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.