పవన్ సినిమాలో నటి అనసూయ.. ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చిన నటి?

జబర్దస్త్ యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ( Anasuya ) ప్రస్తుతం వెండితెర నటిగా వరుసు సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.

ఇలా నటిగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె తిరిగి బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చారు.

ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ విధంగా వరుస సినిమాలు బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియా( Social Media )లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

"""/" / ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా తనకు వీలు అయినప్పుడు సరదాగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు ఈ క్రమంలోనే ఇటీవల అభిమానులతో చిట్ చాట్ చేసిన అనసూయకు ఒక నెటిజన్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.

ఈ సందర్భంగా సదరు నెటిజన్ ప్రశ్నిస్తూ.మీరు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) సినిమాలో ఎప్పుడూ నటిస్తున్నారు అంటూ ప్రశ్న వేశారు.

"""/" / ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించానని సమాధానం ఇచ్చారు.

దీంతో పవన్ అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఏ సినిమాలో ఈమె ఒక చిన్న పాత్రలో నటించారనే విషయంపై ఆరా తీయడం మొదలుపెట్టారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.హరిహర వీరమల్లుతో పాటు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలలో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాలన్నీ కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకొని వాయిదా పడ్డాయి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా ఈయన బాధ్యతలు తీసుకోవడంతో సినిమాలకు విరామం ప్రకటించారు.

తనకు వీలైనప్పుడు ఈ సినిమాలన్నింటినీ పూర్తి చేస్తానని వెల్లడించారు.   .

రాజమౌళి ఓ పిచ్చోడు.. ప్రేమతో తారక్ చేసిన ఈ కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే!