చర్మ ఆరోగ్యాన్ని పోషించడానికి మన వంట గదిలో ఎన్నో ఔషధాలు ఉన్నాయి.అటువంటి వాటిల్లో మీగడ( Milk Cream ) ఒకటి.
పాలపై ఏర్పడే మీగడను చాలా మంది ఇష్టంగా తింటుంటారు.ఇంకొందరు ఫ్యాట్ అని పక్కకు తోసేస్తుంటారు.
మీగడ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయి అనేది పక్కన పెడితే.చర్మానికి( Skin ) మాత్రం అది చాలా మేలు చేస్తుంది.
మీగడలో ఫ్యాట్స్ అనేవి అధిక మొత్తంలో ఉంటాయి.అందువల్ల ఇది చర్మానికి ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్ గా( Natural Moisturizer ) పనిచేస్తుంది.
మీగడ చర్మానికి చక్కని మెరుపును జోడిస్తుంది.ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
స్కిన్ టోన్ ను పెంచడంలో, సన్ బర్న్ నుంచి ఉపశమనాన్ని అందించడంలో, డార్క్ సర్కిల్స్ ను నివారించడంలో, ముదురు మచ్చలు మాయం చేయడంలో, స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేయడంలో మీగడ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఇక ఈ ప్రయోజనాలు పొందాలంటే మీగడను చర్మానికి ఏ విధంగా ఉపయోగించాలి అన్నది కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

పొడి చర్మతత్వం( Dry Skin ) కలిగిన వారు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మీగడ, వన్ టీ స్పూన్ తేనె, హాఫ్ టీ స్పూన్ బాదం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పట్టించి సున్నితంగా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆపై మరో 10 నిమిషాలు చర్మాన్ని ఆరబెట్టుకుని అప్పుడు క్లాత్ సహాయంతో చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే పైన చెప్పిన ప్రయోజనాలు మీ సొంతమవుతాయి.

ఆయిలీ స్కిన్ కలిగిన వారు ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, రెండు టేబుల్ స్పూన్లు మీగడ, వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి.
కాంబినేషన్ స్కిన్ కలిగి ఉన్నవారు రెండు టేబుల్ స్పూన్ల మీగడలో రెండు టేబుల్ స్పూన్లు అరటిపండు ప్యూరీ, వన్ టీ స్పూన్స్ ఓట్స్ పౌడర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి.పూర్తిగా ఆరిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకుంటే పై ప్రయోజనాలన్ని పొందుతారు.