ఆ భూతంపై పవన్ యుద్ధం .. పిఠాపురం నుంచి మొదలు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP Deputy CM Pawan Kalyan ) వినూత్న ఆలోచనలతో సరికొత్త పరిపాలన అందించే విధంగా ముందుకు వెళుతున్నారు.ప్రజలకు ఆదర్శవంతమైన పాలన అందించేందుకు అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

 Ap Deputy Cm Pawan Kalyan Action To Reduce Plastic Use, Pithapuram, Pawan Kalyan-TeluguStop.com

టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ విషయంలో రాజీ పడకుండా ముందుకు వెళుతోందనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక సొంతంగా తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పైన ప్రత్యేకం గా ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్.

తాజాగా ప్లాస్టిక్ భూతం పై యుద్ధాన్ని ప్రకటించారు పవన్.ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం( lastic use ) పెరిగిపోవడం, విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుండడం, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు వీటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ఆచరణలో మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో , ఇప్పుడు ఆ ప్లాస్టిక్ భూతం పై పవన్ పోరాడేందుకు సిద్ధమయ్యారు.

Telugu Apdeputy, Ap, Chandrababu, Cm Chandrababu, Janasena, Janasenani, Pawan Ka

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నట్లు పవన్ ప్రకటించారు.ఈ మేరకు తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నట్లు ప్రకటించారు.ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు.అలాగే వినాయక చవితి వేడుకల్లోనూ మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం చేకూరుతుందని, దేవాలయాల్లో ప్రసాదాన్ని ఆకులు, కప్పులు తాటాకు బుట్టలలో వాడాలని పవన్ సూచించారు.

ఈ తరహా ప్రయోగం పిఠాపురంలోని ఆలయాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టబోతున్నట్లు పవన్ ప్రకటించారు.పిఠాపురం నియోజకవర్గంలో ప్లాస్టిక్ వినియోగం బాగా తగ్గించగలిగితే, దేశ వ్యాప్తంగా ఈ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని ఆలోచనతో పవన్ ఉన్నారు.br>

Telugu Apdeputy, Ap, Chandrababu, Cm Chandrababu, Janasena, Janasenani, Pawan Ka

ప్లాస్టిక్ వ్యర్ధాలు తగలబెట్టడం వల్ల క్లోరో క్లోరో కార్బన్ లు వెలువడి పర్యావరణ కాలుష్యం( Environmental pollution ) అవుతుందని, అందుకే వీటి వినియోగం పై ప్రజల్లో అవగాహన కల్పించి వారిలో మార్పు తీసుకువచ్చి , ప్లాస్టిక్ రహిత నియోజకవర్గం గా పిఠాపురం ను తీర్చిదిద్దాలనే సంకల్పంతో పవన్ ఉన్నారు.రాష్ట్రవ్యాప్తంగా పిఠాపురం ను ఈ విషయంలో రోల్ మోడల్ గా చూపించి, రాష్ట్రమంతుట ఈ విధానాన్ని అమలు చేయించేలా పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube