ఓ పూట తిని, మరో పూట సరిగా తినకపోతేనో, సిగరెట్లు అతిగా కాల్చడం వల్లనో, అతిమద్యపానం, రోడ్ సైడ్ ఆహార అలవాట్లు, అశుభ్రత .ఇలా రకరకాల కారణాలున్నాయి కడుపులో మంట రావడానికి .
ఎప్పుడో ఓసారి మంటగా ఉంటోంది కదా అని మళ్ళీ అవే అలవాట్లతో మళ్ళీ కడుపులో మంటని కొనితెచ్చుకుంటాం .ఇలా మాటిమాటికి జరిగితే అల్సర్ వస్తుంది, దురదృష్టం దగ్గరైతే కడుపులో క్యాన్సర్ కూడా వస్తుంది.
మరి ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి ? చాలా సింపుల్ .పైన చెప్పిన అలవాట్లన్నీ మానుకోవాలి .సమయానికి తిండి, పొగ తాకపోవడం , మద్యాన్ని అతిగా తీసుకోకపోవడం, ఏదిపడితే అది తినకపోవడం .ఇలాంటివి అన్నమాట .సరే ఓసారి లయతప్పేసరికి కడుపులో మంట పుట్టుకొచ్చింది , మరి అప్పుడేం చేయాలి ? దానికి కూడా కొన్ని చిట్కాలు ఉన్నాయి, చదివేయండి .
* చల్లని నీళ్ళలో కాస్తంత పంచదార కలుపుకొని తాగండి .ఒక్కసారికి మంట తక్కువ కాకపొతే, మరోసారి తాగండి పర్లేదు .అతి సులువైన చిట్కా ఇది.
* అల్లం కడుపులో మంట పోగొట్టడానికి ఒక సమర్థవంతమైన సాధనం.చిన్న అల్లం ముక్క తీసుకొని బాగా నమిలి, కొన్ని నీళ్ళు తాగండి .లేదంటే నీళ్ళని లేదా పాలని మరగబెట్టి, దాంట్లో అల్లం వేసి తాగినా కడుపు మంట పారిపోవాల్సిందే .
* చమోమిలే టీ తాగడం కూడా పనిచేస్తుంది.కడుపుమంటకి ఇది మంచి ఉపశమనం .
* బొప్పాయి కూడా కడుపుమంట తగ్గించుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది .
* చివరగా చెబుతున్నా, అత్యధ్బుతమైన చిట్కా ఇది.కొబ్బరి నీళ్ళు చేయని మేలు ఏముంటుంది ! కడుపులో మంట ఉన్నప్పుడు మాత్రమే కాదు, రోజూ కొబ్బరినీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి .