అమెరికాలో మానవ అక్రమ రవాణా రాకెట్ .. నలుగురు భారత సంతతి వ్యక్తుల అరెస్ట్

అక్రమ మార్గాల్లో అమెరికా( America )లో అడుగుపెట్టాలని భావించే భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.

 4 Indian Americans Arrested For Running Human Trafficking Racket In Texas , Tex-TeluguStop.com

అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా.

మనదేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మానడం లేదు.ఇటువంటి వ్యక్తుల బలహీనతలను అదనుగా చేసుకుని ఏజెంట్లు, మానవ అక్రమ రవాణా ముఠాలు రెచ్చిపోతున్నాయి.

అమెరికాకు చేరుస్తామంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేయడంతో పాటు ప్రమాదకర పరిస్ధితుల మధ్య వారిని తరలించి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

Telugu America, American, Racket, Princeton, Texas-Telugu Top Posts

తాజాగా అమెరికాలోని టెక్సాస్ ( Texas )రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా గ్యాంగ్‌ను నడుపుతున్న మహిళ సహా నలుగురు భారత సంతతి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి అభియోగాలు నమోదు చేశారు.ప్రిన్స్‌టన్( Princeton ) పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ మేరకు దర్యాప్తు వివరాలను విడుదల చేసింది.15 మంది మహిళలను కార్మికులుగా తరలించడంతో ఈ గ్యాంగ్ బాగోతం బయటపడినట్లు స్థానిక వార్తా సంస్థ నివేదించింది.నిందితులను చందన్ దాసిరెడ్డి (24), ద్వారక గుండా (31), సంతోష్ కట్కూరి (31), అనిల్ మలే (27)లుగా గుర్తించారు.ఈ కేసులో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

Telugu America, American, Racket, Princeton, Texas-Telugu Top Posts

ప్రిన్స్‌టన్‌లోని కొలిన్ కౌంటీలోని గిన్స్‌బర్గ్‌లేన్‌లోని ఇంటిలో నివసిస్తున్న యువతులను బలవంతంగా నేలపై పడుకోబెట్టినట్లుగా పోలీసులు తెలిపారు.మానవ అక్రమ రవాణాకు కేంద్రంగా ఉన్న ఆ ఇంటిలో ప్రాథమికంగా ఫర్నిచర్ లేదు.కంప్యూటర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుప్పట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు.ఆ ఇంటి నుంచి పలు ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లు, ప్రింటర్లు, నకిలీ డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ప్రిన్స్‌టన్, మెలిస్సా, మెక్‌కిన్నే సహా పలు ప్రదేశాల్లో మగవారితో కలిసి ఆ మహిళలు పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.ఆ రాకెట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటన అమెరికాలో కలకలం రేపుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube