అమెరికాలో మానవ అక్రమ రవాణా రాకెట్ .. నలుగురు భారత సంతతి వ్యక్తుల అరెస్ట్

అక్రమ మార్గాల్లో అమెరికా( America )లో అడుగుపెట్టాలని భావించే భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.

అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా.

మనదేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మానడం లేదు.

ఇటువంటి వ్యక్తుల బలహీనతలను అదనుగా చేసుకుని ఏజెంట్లు, మానవ అక్రమ రవాణా ముఠాలు రెచ్చిపోతున్నాయి.

అమెరికాకు చేరుస్తామంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేయడంతో పాటు ప్రమాదకర పరిస్ధితుల మధ్య వారిని తరలించి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

"""/" / తాజాగా అమెరికాలోని టెక్సాస్ ( Texas )రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా గ్యాంగ్‌ను నడుపుతున్న మహిళ సహా నలుగురు భారత సంతతి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి అభియోగాలు నమోదు చేశారు.

ప్రిన్స్‌టన్( Princeton ) పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ మేరకు దర్యాప్తు వివరాలను విడుదల చేసింది.

15 మంది మహిళలను కార్మికులుగా తరలించడంతో ఈ గ్యాంగ్ బాగోతం బయటపడినట్లు స్థానిక వార్తా సంస్థ నివేదించింది.

నిందితులను చందన్ దాసిరెడ్డి (24), ద్వారక గుండా (31), సంతోష్ కట్కూరి (31), అనిల్ మలే (27)లుగా గుర్తించారు.

ఈ కేసులో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. """/" / ప్రిన్స్‌టన్‌లోని కొలిన్ కౌంటీలోని గిన్స్‌బర్గ్‌లేన్‌లోని ఇంటిలో నివసిస్తున్న యువతులను బలవంతంగా నేలపై పడుకోబెట్టినట్లుగా పోలీసులు తెలిపారు.

మానవ అక్రమ రవాణాకు కేంద్రంగా ఉన్న ఆ ఇంటిలో ప్రాథమికంగా ఫర్నిచర్ లేదు.

కంప్యూటర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుప్పట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు.ఆ ఇంటి నుంచి పలు ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లు, ప్రింటర్లు, నకిలీ డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రిన్స్‌టన్, మెలిస్సా, మెక్‌కిన్నే సహా పలు ప్రదేశాల్లో మగవారితో కలిసి ఆ మహిళలు పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఆ రాకెట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటన అమెరికాలో కలకలం రేపుతోంది.

రాజమౌళి ఓ పిచ్చోడు.. ప్రేమతో తారక్ చేసిన ఈ కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే!