పరాయి గడ్డపై అడుగుపెట్టినా భారతీయురాలినే .. భగవద్గీతపై యూకే ఎంపీ ప్రమాణం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారత సంతతి వ్యక్తులు అక్కడి అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు.అయితే ‘‘ ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా’’ అన్నట్లు ఏ స్థాయిలో వున్నా భారత మూలాలు మరిచిపోకుండా ఖండాంతరాలలో వున్నా మన సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తున్నారు.

 Indian-origin Uk Mp Shivani Raja Takes Oath On Bhagavad Gita Details, Indian Uk-TeluguStop.com

ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన యూకే ఎంపీ శివానీ రాజా( UK MP Shivani Raja ) వార్తల్లో నిలిచారు.

ఇటీవల జరిగిన యూకే సార్వత్రిక ఎన్నికల్లో లైసెస్టర్ ఈస్ట్( Leicester East ) నియోజకవర్గం నుంచి 29 ఏళ్ల శివానీ విజయం సాధించారు.అంతేకాదు.37 ఏళ్లుగా లేబర్ పార్టీకి( Labour Party ) కంచుకోటగా ఉన్న ఈ సెగ్మెంట్‌లో కన్జర్వేటివ్ పార్టీ జెండాని పాతారు.ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్ధి, లేబర్ పార్టీ అభ్యర్ధి రాజేశ్ అగర్వాల్‌ను( Rajesh Agrawal ) ఓడించి హౌస్ ఆఫ్ కామన్స్‌లో అడుగుపెట్టారు శివానీ.ఈ క్రమంలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో తన భారతీయ మూలాలను గుర్తుచేశారు.

హైందవ ధర్మంలో పూజ్యనీయమైన భగవద్గీతపై( Bhagavad Gita ) ఆమె ప్రమాణ స్వీకారం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు.ప్రస్తుతం శివానీ ప్రమాణ స్వీకారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా.యూకే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయులు సత్తా చాటారు.బ్రిటన్ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 27 మంది భారత సంతతి ఎంపీలు హౌస్ ఆఫ్ కామన్స్‌కు( House Of Commons ) ఎన్నికయ్యారు.అలాగే తన కేబినెట్‌లో భారత మూలాలున్న లిసా నందికి( Lisa Nandy ) కల్చర్, మీడియా, క్రీడా శాఖను అప్పగించారు ప్రధాని కీర్ స్టార్మర్.

అన్నింటిలోకి పంజాబీ మూలాలున్న అభ్యర్ధులు (కొందరు సిక్కులు) ఈసారి స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు.రికార్డు స్థాయిలో 12 మంది పంజాబీ సంతతి నేతలు హౌస్ ఆఫ్ కామన్స్‌లో అడుగుపెట్టారు.

ఈ సంఖ్య 2019లో ఐదుగా ఉండేది.

గెలుపొందిన 12 మంది ఎంపీలలో ఆరుగురు మహిళలే కావడం విశేషం.వీరిలో 11 మంది లేబర్ పార్టీ ఎంపీలైతే, గగన్ మోహింద్రా కన్జర్వేటివ్ పార్టీకి చెందినవారు.ప్రీత్‌కౌర్ గిల్, సీమా మల్హోత్రా, తన్‌మన్‌జీత్ సింగ్ ధేసీలు సీనియర్ ఎంపీలు.

ఈ ముగ్గురి పూర్వీకులు పంజాబ్‌లోని జలంధర్ నగరానికి చెందినవారు.సీమా ఐదోసారి ఎంపీగా గెలవగా.

గిల్, ధేసీలు మూడోసారి విజయం సాధించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube