అన్ని రాష్ట్రాల్లో "కల్కి" సూపర్ హిట్టు.. కన్నడ వాళ్లే ఎందుకు రిజెక్ట్ చేశారు..?? 

ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 AD( Kalki 2898 AD )” బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది.రూ.600 కోట్లు పెట్టి తీస్తే ఇప్పటికే దీనికి రూ.800 కోట్ల వరకు డబ్బులు వచ్చాయి.అయితే ఈ కలెక్షన్లను పరిశీలిస్తే ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది.సాక్‌నిల్క్ సైట్ ప్రకారం ఈ సినిమా 13 రోజుల్లో రూ.846 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.హిందీలో రూ.224 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది.రీసెంట్ గా వీకెండ్స్‌లో 18, 22 కోట్ల కలెక్ట్ చేసి అదరగొట్టింది.

 Why Kollywood Rejected Kalki Movie ,kalki 2898 Ad, Kalki Movie ,kollywood-TeluguStop.com

అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ఇందులో నటించడం ఒక పెద్ద ప్లస్ పాయింట్.కథ, గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి.

మైథాలజీతో కథను లింక్ చేయడం హిందీ ఆడియెన్స్‌కు బాగా నచ్చేసి ఉంటుంది, కాబట్టే ఈ రేంజ్‌లో కలెక్షన్స్ వస్తున్నాయి.

Telugu Kalki Ad, Kalki, Kamal Haasan, Karnataka, Kollywood, Nag Ashwi, Prabhas,

తెలుగులో రూ.250 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.ఈ వారాంతరంలో 11, 16 కోట్ల రావడం విశేషం.

అయితే నైజాం, ఆంధ్రాలో కొన్నిచోట్ల ఈ సినిమాకి పెద్దగా వసూళ్లు రాలేదని తెలుస్తోంది.హీరో తెలుగు వాడే కాబట్టి ఓవరాల్‌గా తెలుగులోనూ ఇది మంచి పర్ఫామెన్స్ కనబరుస్తోంది.ఓవర్సీస్‌లో ఈ సినిమాకు రూ.227 కోట్లు వచ్చాయి.విదేశాల్లో ఉండేవారు ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారని అర్థమవుతోంది.హాలీవుడ్ టైప్ గ్రాఫిక్స్ ఉండడం వల్ల, మహాభారతంలోని పాత్రలను చక్కగా వాడుకోవడం వల్ల వాళ్లు కనెక్ట్ అయి ఉండవచ్చు.

Telugu Kalki Ad, Kalki, Kamal Haasan, Karnataka, Kollywood, Nag Ashwi, Prabhas,

ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వేరే హీరోల చిత్రాలు పెద్దగా ఆడవు.కల్కి సినిమా కూడా అలాంటి పూర్ రెస్పాన్స్‌యే సాధించింది.తమిళనాడులో ఈ సినిమాకి రూ.31 కోట్లు, కేరళలో రూ.19 కోట్లు వచ్చాయి.కలెక్షన్లు ఇలాగే వస్తాయని ముందు నుంచి అంచనాలు ఉన్నాయి కాబట్టి ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు కానీ కర్నాటక(Karnataka )లో వచ్చిన స్పందన ఇప్పుడు చాలామందిని నోరెళ్లబెట్టేలా చేస్తోంది.కన్నడ “కల్కి” మూవీ వెర్షన్ వసూళ్లు ఇప్పటిదాకా కేవలం 4 కోట్లు మాత్రమే వసూలు చేసింది.12, 13 రోజుల్లో కలెక్షన్స్ 15, 10 లక్షలు మాత్రమే వచ్చాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి.కర్ణాటకలో ప్రభాస్ ( Prabhas )సినిమాని మరీ అంత ఘోరంగా రిజెక్ట్ చేశారా అని ప్రస్తుతం ఒక చర్చ మొదలయ్యింది.అమితాబ్, దీపిక కారణంగా హిందీలో ఈ సినిమా హిట్ అయిందని, కమల్‌ హాసన్ కారణంగా తమిళనాడులో అన్నా బెన్‌ పుణ్యమా అని కేరళలో సినిమా సక్సెస్ అయిందని అంటున్నారు.

కల్కి సినిమాలో కన్నడ యాక్టర్స్ ఎవరూ లేరు.అందుకే కన్నడ ప్రజలు కల్కి సినిమాని సింపుల్‌గా ఇగ్నోర్ చేసి ఉంటారని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.నిజానికి సినిమాలో ఫలానా యాక్టర్స్ ఉన్నారని ఎవరూ మూవీ చూడరు.కథ బాగుంటే సినిమా చూస్తారు.

కానీ కల్కి మూవీ విషయంలో మాత్రం ఇది అబద్ధమేమో అనిపిస్తోంది.నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తే అదే నిజమని నమ్మక తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube