సినీ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం.యాక్టర్స్ పైకి నవ్వుతూ కనిపించినా వారు ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు ఫేస్ చేస్తారు.
ఒకసారి ఈ విషయాలను వారి బయట పెట్టుకొని ఏడ్చేస్తుంటారు.స్టార్ హీరోయిన్లు కూడా ఇలాంటి కష్టాలను ఫేస్ చేస్తారు.
టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖ( Rekha ) కూడా వ్యక్తిగత జీవితంలో చాలా కష్టాలను చవిచూసింది.ఈ ముద్దుగుమ్మ ఒరిజినల్ నేమ్ భాను రేఖ.చెన్నైలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ చాలా రొమాంటిక్ సినిమాలు చేసింది.అయితే ఈ రొమాంటిక్ లైఫ్ ఆమె ఆన్ స్క్రీన్ కే పరిమితమైంది.
రియల్ లైఫ్ లో ఆమె ప్రేమను పొందలేకపోయింది.వివాహమైన కొద్ది రోజులకే ఆమె భర్త చనిపోయాడు.
దాంతో ఆమె ఒంటరి పక్షి అయింది.
అయితే రేఖ ఓ స్టార్ హీరోతో లవ్ అఫైర్ నడిపిందని అప్పట్లో రూమర్స్ షికారు చేసేవి.1980లో రేఖ, అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan )జంటగా “దో అంజనే” సినిమా చేశారు ఈ సినిమా ద్వారానే వాళ్లు తొలిసారి కలుసుకున్నారు.షూటింగ్‌లో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.
వీళ్లు నటించిన తొలి సినిమా మంచి హిట్ అయింది.వీరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది.
ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి దాదాపు 10 సినిమాలు చేశారు.రేఖ ఎప్పుడూ ఓపెన్ గా మాట్లాడేది.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు కూడా తన లైఫ్ సీక్రెట్స్ ధైర్యంగా బయట పెట్టింది.
బాధలో ఉన్న ప్రతిసారి ఆల్కహాల్ ఆపకుండా తాగే దాన్ని కూడా చెప్పి షాక్ ఇచ్చింది.అతిగా మద్యం తాగిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పింది.డ్రగ్స్ కూడా తీసుకునే దాన్ని అని ఇంటర్వ్యూలోనే వెల్లడించి అందరి చేత నోరెళ్ల బెట్టించింది.
జీవితంలో ప్రత్యక్ష నరకాన్ని అనుభవించాలని పేర్కొంది.జీవితంలో అన్ని పోగొట్టుకున్నాక కుమిలిపోయానని, ఆ విషయం ఎవరికీ చెప్పలేక వ్యసనాలకు అలవాటు పడ్డానని తెలిపింది.
ఇకపోతే హీరోయిన్ రేఖకు గర్గాంజ్ లో ఆస్తులు ఉన్నట్లు తెలిసింది.డబ్బులున్నా, ప్రేమ, వైవాహిక జీవితంలో లేక ఆమె ఎప్పుడూ నిరాశలో ఉండేది.
భర్త, పిల్లలు లేని ఈ నటి కోట్ల ఆస్తి ఎవరికి దక్కుతుందని అనేది తెలియ రాలేదు.ఈ ముద్దుగుమ్మ ఆస్తి రూ.400 కోట్లకు పైగా ఉంటుందని టాక్.ఆ ఆస్తి మొత్తాన్ని తన మేనేజర్ ఫర్జానాకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఫర్జానా గత 32 ఏళ్లుగా రేఖ వచ్చిందే పని చేస్తోందట.