యూకే కొత్త కేబినెట్‌లో భారత సంతతి మహిళకు చోటు .. మంత్రుల లిస్ట్ ఇదే..?

యూకే సార్వత్రిక ఎన్నికల్లో రిషి సునాక్( Rishi Sunak ) సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.దాదాపు 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చి బ్రిటన్ కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్( UK PM Keir Starmer ) బాధ్యతలు స్వీకరించారు.

 Uk Pms New Cabinet Indian-origin Lisa Nandy Gets Culture Sports And Media Detail-TeluguStop.com

అంతా బాగానే ఉంది కానీ స్టార్మర్ కేబినెట్ ఎలా ఉండబోతోంది.? ఎవరెవరు స్థానం దక్కించుకోనున్నారు.? అనేది ఆసక్తికరంగా మారింది.బ్రిటన్ మహారాజు కింగ్ ఛార్లెస్ IIIతో రిషి సునాక్ భేటీ తర్వాత బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కీర్ స్టార్మర్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.650 మంది సభ్యులున్న హౌస్ ఆఫ్ కామన్స్‌లో లేబర్ పార్టీ( Labour Party ) 412 సీట్లు సాధించగా.కన్జర్వేటివ్‌లు 121కే పరిమితమయ్యారు.లేబర్ పార్టీకి 33.7 శాతం ఓట్లు పోలవ్వగా.కన్జర్వేటివ్‌లకు 23.7 శాతం ఓట్లు దక్కాయి.

Telugu Angela, Conservative, Indian Origin, Keir, Lisa Nandy, Rishi Sunak, Uk Mi

అధికారాన్ని అందుకున్న వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిని కీర్ స్టార్మర్ వేగవంతం చేశారు.తన కేబినెట్ కూర్పును వేగంగా పూర్తి చేయడంతో పాటు మంత్రులకు శాఖలను సైతం కేటాయించారు.కీర్ స్టార్మర్ తన సతీమణి , యూకే ప్రథమ మహిళ విక్టోరియా స్టార్మర్‌లు ప్రధాన మంత్రి అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో అడుగుపెట్టారు.అక్కడ కొత్త కేబినెట్ మంత్రులు సందడి చేయడాన్ని పలు మీడియా సంస్థలు నివేదించాయి.

బ్రిటన్ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 28 మంది భారత సంతతి ఎంపీలు హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు.తన కేబినెట్‌లో భారత మూలాలున్న లిసా నందికి( Lisa Nandy ) కల్చర్, మీడియా, క్రీడా శాఖను అప్పగించారు ప్రధాని కీర్ స్టార్మర్.

Telugu Angela, Conservative, Indian Origin, Keir, Lisa Nandy, Rishi Sunak, Uk Mi

కీర్ స్టార్మర్ కేబినెట్ :

ప్రధాన మంత్రి – కీర్ స్టార్మర్

ఉప ప్రధానమంత్రి – ఏంజెలా రేనర్( Angela Rayner )

ఆర్థిక కార్యదర్శి – రాచెల్ రీవ్స్

హోం కార్యదర్శి – యివెట్ కూపర్

రక్షణ కార్యదర్శి – జాన్ హీలీ

విదేశాంగ కార్యదర్శి – డేవిడ్ లామీ

న్యాయ కార్యదర్శి – షబానా మహమూద్

ఆరోగ్య కార్యదర్శి – వెస్ స్ట్రీటింగ్

విద్యా కార్యదర్శి – బ్రిడ్జేట్ ఫిలిప్సన్

ఎనర్జీ కార్యదర్శి – ఎడ్ మిలిబాండ్

Telugu Angela, Conservative, Indian Origin, Keir, Lisa Nandy, Rishi Sunak, Uk Mi

వర్క్ అండ్ పెన్షన్ల శాఖ కార్యదర్శి – లిజ్ కెండాల్

బిజినెస్ సెక్రటరీ – జోనాథన్ రేనాల్డ్స్( Jonathan Reynolds )

సైన్స్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ – పీటర్ కైల్

రవాణా కార్యదర్శి – లూయిస్ హై

పర్యావరణం, ఆహారం , గ్రామీణ వ్యవహారాల కార్యదర్శి – స్టీవ్ రీడ్

సంస్కృతి, మీడియా, క్రీడా కార్యదర్శి – లిసా నంది

ఉత్తర ఐర్లాండ్ రాష్ట్ర కార్యదర్శి – హిల్లరీ బెన్

స్కాట్లాండ్ రాష్ట్ర కార్యదర్శి – ఇయాన్ ముర్రే

అటార్నీ జనరల్ – రిచర్డ్ హెర్మెర్ కేసీ

లీడర్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ లార్డ్స్ – బాసిల్డన్ యొక్క బారోనెస్ స్మిత్

లీడర్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ కామన్స్ – లూసీ పావెల్

వేల్స్ రాష్ట్ర కార్యదర్శి – జో స్టీవెన్స్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube