ప్రస్తుత రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా దాదాపు అందరూ కామన్ గా ఫేస్ చేస్తున్న సమస్యల్లో హెయిర్ ఫాల్( Hair fall ) ఒకటి.మారిన జీవనశైలి, వేళకు ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి, నిరంతర ఆలోచనలు, కంటి నిండా నిద్ర లేకపోవడం, పోషకాల కొరత, ధూమపానం తదితర కారణాల వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది.
హెయిర్ ఫాల్ కారణంగా చాలా మంది తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు.కానీ ఒత్తిడి వల్ల జుట్టు మరింత రాలిపోతుంది.
కాబట్టి ఒత్తిడిని పక్కన పెట్టి జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించండి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే నూనె హెయిర్ ఫాల్ ను సమర్థవంతంగా అరికడుతుంది.
జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ నూనెను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఐదు నుంచి ఆరు తమలపాకులను( Betel leaves ) తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాసు నువ్వుల నూనె( Sesame oil ) వేసుకోవాలి.
ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో తరిగిన తమలపాకులు వేసి చిన్న మంటపై దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను ఉపయోగించాలి.స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ రాసుకున్న మరుసటి రోజు లేదా నాలుగు గంటల అనంతరం తేలికపాటి షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు.
నువ్వుల నూనె ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు పోషణకు సైతం ఉత్తమంగా తోడ్పడుతుంది.నువ్వుల నూనె తలపై రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది.
జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.నువ్వుల నూనెలో ఉండే ఒమేగా -3 మరియు ఒమేగా -6 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు రాలడాన్ని అరికడతాయి.

అలాగే తమలపాకులు సైతం చాలా ఎఫెక్టివ్ గా హెయిర్ ఫాల్ ను నివారిస్తాయి.జుట్టును కండిషన్ చేస్తాయి.కురులు ఒత్తుగా, పొడవుగా పేరిగేలా ప్రోత్సహిస్తాయి.తలలో దురద, చుండ్రు వంటి సమస్యలకు చికిత్స చేయడంలో కూడా తమలపాకులు సహాయపడుతుంది.కాబట్టి హెయిర్ ఫాల్ తో బాధపడుతున్న వారు తమలపాకులు వేసి ముగించిన నువ్వుల నూనెను తప్పకుండా వాడేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీసొంతం అవుతుంది.







