వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడి రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు.కౌన్సిలర్లుగా , మేయర్లుగా, ఎంపీలుగా, సెనేటర్లుగా, ప్రధానులుగా, ఉపాధ్యక్షులుగా, అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు.
భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో యూకే ఒకటి.భారత్ – బ్రిటన్( India – Britain )ల మధ్య అనుబంధం ఈనాటిది కాదు.
వలస పాలన సమయంలో ఎంతో మంది భారతీయులు ఇంగ్లాండ్ వెళ్లి అక్కడే సెటిలయ్యారు.స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ వలసలు మరిన్ని పెరిగాయి.
ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం ప్రతి యేటా లక్షలాది మంది భారతీయులు యూకేకు తరలివస్తున్నారు.ఈ నేపథ్యంలో మనవారు బ్రిటన్‌లోని కీలక పార్టీల్లో చేరి రాజకీయాలను శాసిస్తున్నారు.
ఇటీవల ముగిసిన యూకే సార్వత్రిక ఎన్నికల్లోనూ భారతీయులు సత్తా చాటారు.బ్రిటన్ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 28 మంది భారత సంతతి ఎంపీలు హౌస్ ఆఫ్ కామన్స్( House of Commons )కు ఎన్నికయ్యారు.అలాగే తన కేబినెట్‌లో భారత మూలాలున్న లిసా నందికి కల్చర్, మీడియా, క్రీడా శాఖను అప్పగించారు ప్రధాని కీర్ స్టార్మర్.అన్నింటిలోకి పంజాబీ మూలాలున్న అభ్యర్ధులు ఈసారి స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు.
రికార్డు స్థాయిలో 12 మంది పంజాబీ సంతతి నేతలు హౌస్ ఆఫ్ కామన్స్‌లో అడుగుపెట్టారు.ఈ సంఖ్య 2019లో ఐదుగా ఉండేది.
హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికైన పంజాబీ సంతతి ఎంపీలు వీరే :
ప్రీత్ కౌర్ గిల్ – బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్( Preet Kaur Gill ) , సీమా మల్హోత్రా – ఫెల్తామ్-హెస్టన్ , తన్మంజీత్ ధేసీ – స్లౌ ,సత్వీర్ కౌర్ – సౌతాంప్టన్ , హర్‌ప్రీత్ కౌర్ ఉప్పల్ – హడర్స్‌ఫీల్డ్ సోనియా కుమార్ – డడ్లీ ,వారిందర్ జాస్ – వోల్వర్‌హాంప్టన్ వెస్ట్ ,జాస్ అత్వాల్ – ఇల్ఫోర్డ్ సౌత్ , జీవున్ సంధర్ – లౌబరో , కిరిత్ అహ్లువాలియా – బోల్టన్ నార్త్ ఈస్ట్ గురిందర్ సింగ్ జోసన్ – స్మెత్విక్, గగన్ మోహింద్రా – సౌత్ వెస్ట్ హెర్ట్స్ , గెలుపొందిన 12 మంది ఎంపీలలో ఆరుగురు మహిళలే కావడం విశేషం.వీరిలో 11 మంది లేబర్ పార్టీ ఎంపీలైతే, గగన్ మోహింద్రా కన్జర్వేటివ్ పార్టీకి చెందినవారు.ప్రీత్‌కౌర్ గిల్, సీమా మల్హోత్రా, తన్‌మన్‌జీత్ సింగ్ ధేసీలు సీనియర్ ఎంపీలు.ఈ ముగ్గురి పూర్వీకులు పంజాబ్‌లోని జలంధర్ నగరానికి చెందినవారు.సీమా ఐదోసారి ఎంపీగా గెలవగా.గిల్, ధేసీలు మూడోసారి విజయం సాధించారు.